Begin typing your search above and press return to search.
అప్పుగా రూ.200 అడిగితే ఇవ్వలేదని గన్ తో కాల్చి చంపాడు
By: Tupaki Desk | 30 Nov 2020 11:46 AM ISTయూపీ.. బిహార్.. రాష్ట్రాల్లో చోటు చేసుకునే నేరాల ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. అప్పుగా రూ.200 అడిగితే.. ఇవ్వని కారణంగా నాటు తుపాకీతో కాల్చి చంపిన దుర్మార్గం తాజాగా చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. స్థానిక షంషాద్ మార్కెట్లో అన్సర్ అహ్మద్ అనే 30 ఏళ్ల యువకుడు షాపును నిర్వహిస్తుంటాడు. అతడి వద్దకు అసిఫ్ అనే వ్యక్తి వచ్చాడు. తనకు రూ.200 అప్పుగా ఇవ్వాలని అడిగాడు. అందుకు అన్సర్ ఇవ్వలేనని చెప్పాడు.
దీంతో.. ఆగ్రహం చెందిన అసిప్.. తన దగ్గరున్న నాటు తుపాకీతో అహ్మద్ తల మీద కాల్చటంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. కేవలం రూ.200 అప్పు అడిగితే ఇవ్వనందుకు ఇంత దారుణానికి పాల్పడతారా? అంటూ విస్తుపోతున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.