Begin typing your search above and press return to search.

యువతిని చంపేసి.. ముక్కలు, ముక్కలు.. తల మాయం.. డంపింగ్ యార్డులో మాంసం ముద్దలు

By:  Tupaki Desk   |   27 Oct 2020 11:30 AM IST
యువతిని చంపేసి.. ముక్కలు, ముక్కలు.. తల మాయం.. డంపింగ్ యార్డులో మాంసం ముద్దలు
X
సభ్యసమాజం తలదించుకొనే ఘటన ఇది.. ఓ యువతిని హత్య చేసిన దుండగులు ఆమె తల, మొండెం వేరు చేశారు. తల కింది భాగాన్ని ముక్కలు, ముక్కలుగా చేసి డంపింగ్​ యార్డులో పడేశారు. సదరు యువతి వయసు 30 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి శరీరాన్ని కూడా 30 ముక్కలుగా కోయడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటివరకు ఏ ఆధారాలు దొరకక పోలీసులు తికమకపడుతున్నారు. మాంసం ముక్కలను ప్లాస్టిక్ సంచిలో వేసి దానిని డంప్ యార్డ్ లో పడేశారు. సంచిలో ఉన్న మాంసం ముక్కలను కుక్కలు బయటకు లాగి తినడంతో అక్కడ ఉన్న పిల్లలు చూసి కేకలు వేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు మహిళ శరీరం ముక్కలు మాత్రమే చిక్కాయి. తల ఇంత వరకు పోలీసులకు చిక్కకపోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ఉత్తర్​ప్రదేశ్​ ఫతేహుల్లాపూర్ ప్రాంతంలోని శ్మశానవాటిక సమీపంలో కార్పోరేషన్ డంపింగ్ యార్డు ఉంది. కరోనా వైరస్ కారణంగా స్కూల్స్ మూసివేయడంతో స్థానికంగా నివాసం ఉంటున్న పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. డంపింగ్ మార్డు సమీపంలో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు గుంపుగా అక్కడికి వెళ్లాయి. మాంసం ముక్కలున్న శరీరభాగాలను కుక్కలు తినడం గమనించిన పిల్లలు కేకలు వేస్తూ స్థానికులకు చెప్పారు.

సమాచార మందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని శరీరభాగాలను స్వాధీనం చేసుకున్నారు. డంపింగ్ మార్డులో మహిళ శరీరం ముక్కలు మాత్రమే దొరికాయని.. తల మాత్రం అక్కడ లేదని మీరట్ సిటీ అడిషనల్ పోలీసు కమిషనర్ అఖిలేష్ నారాయణ్ సింగ్ మీడియాకు చెప్పారు. యువతికి తెలిసిన వాళ్లే ఆమెను నమ్మించి తీసుకెళ్లి హత్యచేసి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.