Begin typing your search above and press return to search.
వీడసలు మనిషే కాదు..లింగ నిర్ధారణ కోసం కడుపు కోశాడు
By: Tupaki Desk | 20 Sept 2020 6:00 PM ISTఒక దిక్కు దేశం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని గొప్పలు చెప్పుకుంటున్నాం. సమాజంలో ఇంత మార్పులు జరుగుతున్నా కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు నిర్ద్యాక్షిణ్యంగా కోత కోసే సంస్కృతి మారడం లేదు. కొంతమంది స్కానింగ్ ల ద్వారా ఆడ బిడ్డలు పుట్టేది తెలుసుకుని అసలు భూమిపైనే అడుగు పెట్టకుండా చిదిమేస్తుండగా మరి కొంతమంది దుర్మార్గులు పుట్టిన ఆడ శిశవులను చెత్త కుండీలు, నీటి పాలు చేస్తున్నారు. ఓ వ్యక్తి పుట్టేది ఆడ బిడ్డో.. మగ బిడ్డో తెలుసుకునేందుకు ఏకంగా కత్తితో పొట్ట కోశాడు. భార్యకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని బదాయూ జిల్లాలో జరిగింది.
సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్ పూర్ లో పన్నా లాల్ దంపతులు నివశిస్తున్నారు. వీరికి ఇప్పటికే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పన్నా లాల్ మగ సంతానం కోసం భార్యను కొద్ది నెలలుగా వేధిస్తున్నాడు. ప్రస్తుతం అతడి భార్య ఏడు నెలల గర్భిణి. అయితే ఈ సారైనా మగ బిడ్డ పుడతాడో లేదోనని పన్నా లాల్ కి సందేహం తలెత్తింది. దీంతో అతడు ఒక పదునైన ఆయుధం తీసుకొని భార్య పొట్ట కోశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అవడంతో బరేలి ఆస్పత్రికి తరలించినట్టు సీనియర్ పోలీస్ అధికారి ప్రవీణ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన పన్నా లాల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.