Begin typing your search above and press return to search.
తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు.. రెండు డెడ్‌బాడీస్ లభ్యం !
By: Tupaki Desk | 30 Aug 2021 2:01 PM ISTవికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయిన సంఘటన గురించి తెలిసిందే. మోమిన్‌పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు ప్రవాహంలో కొట్టుకుపోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో నవ వధూవరులు నవాజ్‌రెడ్డి, ప్రవళిక, వరుడి అక్కలు శ్వేత, రాధమ్మ, కారు డ్రైవర్‌తో పాటు మరో బాలుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 26న రావులపల్లికి చెందిన నవాజ్ రెడ్డికి మోమిన్ పేటకు చెందిన ప్రవళికతో వివాహం జరిగింది. ఆదివారం మోమిన్ పేట కు వెళ్లి వస్తుండగా తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. రోడ్డుపై నుంచి నీరు పారుతుండగా వద్దని వారించినా వినకుండా వాగుదాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు మృతదేహాలు లభ్యం అయ్యినట్లు పోలీసులు వెల్లడించారు. మోమిన్ పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రవాహంలో కారు కొట్టుకుపోగా, ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో రెండు డెడ్ బాడీస్ ను వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. వాగుకు కిలోమీటర్ దూరంలో కారును గుర్తించారు పోలీసులు. మూడ్రోజుల క్రితం పెళ్లైన కొత్త జంట..బంధువులతో కలిసి రావులపల్లి బయల్దేరింది. తిమ్మాపూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడం వాళ్లపాలిట శాపంగా మారింది. తిమ్మాపూర్ వాగు ప్రవాహానికి కారు కొట్టుకుపోయంది.
పెళ్లికొడుకు నవాజ్ రెడ్డి, అతని సోదరి ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది. కారుతో పాటు నలుగురు గల్లంతయ్యారు. రోడ్డుపై నుంచి నీరు పారుతుండగా, వద్దని వారించినా వినకుండా వాగుదాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొన్నారు కాగా, గల్లంతైన వధువు ప్రవల్లిక, వరుడి అక్క రాధమ్మ, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, బాలుడు ఇషాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీవర్షాలకు ఏడుగురు గల్లంతవగా ఒకరు మృతి చెందారు. భారీ వర్షాలతో జరిగిన ఘటనలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. వికారాబాద్ కలెక్టర్, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు మంత్రి సబిత. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, వాగుల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీని ఆదేశించారు.