Begin typing your search above and press return to search.

పెళ్లిచూపుల్లోనే ప్రేమ..! పెద్దలు కాదన్నారని లేచిపోయారు.. కానీ ఎన్నో ట్విస్టులు..!

By:  Tupaki Desk   |   3 April 2021 3:47 AM GMT
పెళ్లిచూపుల్లోనే ప్రేమ..! పెద్దలు కాదన్నారని లేచిపోయారు.. కానీ ఎన్నో ట్విస్టులు..!
X
అందరిలాగే ఆ యువకుడికి ఓ అందమైన యువతిని పెళ్లి చేసుకోవాలని కోరిక. ఇందుకోసం ఎన్నో సంబంధాలు చూస్తున్నాడు. తల్లిదండ్రులు కూడా కుర్రాడికి పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు. కానీ వాళ్లకు అమ్మాయి బాగుండటమే కాదు.. కట్నకానుకలు కూడా నచ్చాలి. ఇదిలా ఉంటే సదరు యువకుడు ఇటీవల ఓ ఊరికి పెళ్లి చూపులకు వెళ్లాడు. అమ్మాయి అతడికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ పిల్లకు కూడా తను నచ్చేశాడు. ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకున్నారు. కానీ అబ్బాయి తల్లిదండ్రులు కట్నం విషయంలో పేచిపెట్టారు.

దీంతో ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే వాళ్లిద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత చాటింగ్​ లు, మీటింగ్​లు నడిచాయి. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్​ అయ్యారు. ఏకంగా హైదరాబాద్​ ఆర్యసమాజ్​ కు వెళ్లి పెళ్లి చేసుకున్నారు.అయితే అమ్మాయి తల్లి దండ్రులు మాత్రం కిడ్నాప్​ కేసు పెట్టారు. తాము మేజర్లమని ఈ జంట అంటున్నది. పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది .. వివరాలేమిటో తెలుసుకుందాం..

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజీగూడేనికి చెందిన సతీష్ కు అతడి తల్లి దండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఇటీవల పెళ్లిచూపుల కోసం సతీశ్​ కుటుంబం నల్లగొండ జిల్లా బొమ్మల రామారం మండలం ఫక్కీర్ గూడ కు వెళ్లింది. అక్కడ అమ్మాయిని చూసిన సతీశ్​ ఫిదా అయ్యాడు. తనకు ఆమె ఎంతో నచ్చింది. ఆ యువతికి సతీశ్​ కూడా నచ్చాడు. ఇద్దరూ కాసేపు పర్సనల్​ గా మాట్లాడుకున్నారు. వ్యక్తిగత ఇష్టాఇష్టాలు అభిరుచులు తెలుసుకున్నారు. అయితే సతీశ్​ పేరెంట్స్​ కు .. యువతి తల్లి దండ్రులు ఇచ్చే కట్న కానుకలు నచ్చలేదు. దీంతో సంబంధం వద్దనుకున్నారు.

అప్పటికే సదరు యువతి నంబర్​ తీసుకున్న సతీశ్​.. ఆమెతో తరచూ మాట్లాడుతున్నాడు. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ ఫిక్స్​ అయ్యారు.ఈ నెల మార్చి 30న ఈ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నది. అక్కడినుంచి సరాసరి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమకు రక్షణ కావాలని కోరింది. అయితే అప్పటికే భువనగిరి పీఎస్​ లో యువతి పై మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఆమె తల్లిదండ్రులు. అయితే ఇరు కుటుంబాలను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

అయితే ఈ అమ్మాయి మాత్రం ‘ మేమిద్దరం మేజర్లం . నేను సతీశ్​ ను ప్రేమిస్తున్నాను. అందుకే పెళ్లి చేసుకున్నాను’ అంటూ చెప్పేసింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ఆ అమ్మాయిని అబ్బాయి ఇంటికి పంపించాలని పోలీసులు ఏర్పాట్లు చేశారు.పోలీసులు వారిని పంపిస్తున్నారని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, ఆమె బంధువులు కారును అడ్డగించి యువతిని తీసుకెళ్లి పోయారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.