Begin typing your search above and press return to search.
సూర్యాపేటలో విషాదం : మాజీ ప్రియుడి కర్కశం .. కాబోయే భర్తకి ఆ ఫోటోలు !
By: Tupaki Desk | 16 Dec 2020 11:47 AM ISTప్రేమ .. ప్రేమ .. ఈ రోజుల్లో ఇది సర్వసాదరణమైంది. అవసరాల కోసం పుట్టే ప్రేమ కొందరిదైతే , మరికొందరిది నిజమైన ప్రేమ. అయితే , ఈ ప్రేమ ముసుగు లో చేసే చేష్టలని చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రేమ పేరుతొ మోసం చేసిన వారుకొందరైతే , ప్రేమ లో మోసపోయి ప్రాణాలు తీసుకున్న వారు మరికొందరు. తాజాగా అలంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని కాదని , మరో వ్యక్తి తో పెళ్ళికి సిద్ధం కావడంతో , ప్రేమికుడు ఆమెని చేసుకోబోయే వాడికి , వారి కుటుంబ సభ్యులకి వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలని పంపడం తో ఆ పెళ్లి పెటాకులైంది. దీనితో ఆ అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట లో చోటుచేసుకుంది.
ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. సూర్యాపేట జిల్లా లో జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురానికి చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జీఎన్ ఎం గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వంశీ, యువతి కొద్దికాలం ప్రేమించుకున్నారు. అయితే అతని పద్ధతులు నచ్చకపోవడంతో ఆమె అతనితో కొద్ది రోజులుగా దూరంగా ఉంటుంది. ఈ తరుణంలోనే యువతి తల్లిదండ్రులు మరొకరితో వివాహం నిశ్చయం చేయడంతో పెళ్లికి ఒప్పుకుంది. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటోందని రగిలిపోయిన మాజీ ప్రియుడు కోపం తో రగిలిపోయి , ఆమె తనతో ఉన్న ఫొటోలను వరుడు, అతని కుటుంబ సభ్యులకు పంపించడు, దీనితో వారు ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు.
దీంతో హైదరాబాద్‌లో ఉన్న యువతిని తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి తీవ్రంగా మందలించారు. కొద్దిరోజులు సూర్యాపేటలోని బంధువుల ఇంట్లో ఉండమని చెప్పి పంపించారు. ఈ నెల 6వ తేదీన సూర్యాపేట చింతలచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె 9 వ తేదీన బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. ఇంటి నుంచి బయటికెళ్లిన కూతురు తిరిగిరాలేదని తెలిసి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిమ్మాపురం గ్రామ పొలాల్లో యువతి మృతదేహం పడి ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించగా యువతి విగతజీవిగా కనిపించింది. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెళ్లి ఆగేలా చేసి , ఆమె మరణానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.