Begin typing your search above and press return to search.

ఫుల్ బాటిల్ ‘రా’ ఛాలెంజ్ ప్రాణాల్ని తీసింది

By:  Tupaki Desk   |   24 Oct 2020 11:45 AM IST
ఫుల్ బాటిల్ ‘రా’ ఛాలెంజ్ ప్రాణాల్ని తీసింది
X
వారిద్దరూ స్నేహితులు. కానీ.. అనవసరమైన బడాయి ఒకరి ప్రాణాన్ని తీస్తే.. మరికొరిని చిక్కుల్లోకి పడేసింది. ఫుల్ బాటిల్ మద్యాన్ని నీళ్లు, సోడా కానీ కలపకుండా తాగేయాలన్న పందెం ఒకరి ప్రాణం పోయేలా చేసింది. ఈ విషాద ఉదంతం ఎక్కడ చోటు చేసుకుందంటే..

తెలంగాణ రాష్ట్రంలోని బాన్సువాడకు చెందిన సాయిలు.. మరొకరు మంచి మిత్రులు. వారిద్దరితో పాటు.. మరో ఐదుగురు కలిసి పట్టణానికి అనుకొని ఉండే పొలంలో పిచ్చాపాటి కబుర్లు పెట్టుకున్నారు. సరదాగా మద్యం సేవించే క్రమంలో వారి మధ్య సంవాదం మొదలైంది. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అన్న మాట మొదలైంది. అది కాస్తా పందెంగా మారింది.

ఫుల్ బాటిల్ మద్యాన్ని నీళ్లు.. సోడా కలపకుండా తాగితే వారు గొప్పగా తేల్చారు. ఈ క్రమంలో జరిగిన పందెంలో వారిద్దరు మరేమీ కలపకుండా ఫుల్ బాటిల్ మద్యాన్ని సేవించారు. వారిద్దరూ మద్యం మత్తులోకి జారుకోగా.. వారిద్దరిని మిగిలిన స్నేహితులు ఇళ్లకు పంపారు. ఇదిలా ఉంటే.. ఇద్దరిలో సాయిలు ఇంటికి వెళ్లిన తర్వాత నుంచి విరోచనాలు మొదలయ్యాయి.

దీంతో.. అతన్ని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లుగా పోలీసులు తేల్చారు. చెత్త పందెం ప్రాణాల్ని తీసింది. ఇలాంటి వాటి విషయంలో అనవసరమైన ఈగోలకు పోకుండా.. ప్రాణాల్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. తన భర్త మరణంపై సాయిలు సతీమణి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటంతో వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.