Begin typing your search above and press return to search.
సెల్లార్ లో డ్రైవర్ నిర్లక్ష్యం..కారు చక్రాల కింద ఛిద్రమైన 18 నెలల చిన్నారి
By: Tupaki Desk | 28 Sept 2020 2:40 PM ISTఓ అపార్ట్మెంట్ సెల్లార్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 18 నెలల చిన్నారి బతుకు ఛిద్రం అయ్యింది. కచ్చితంగా కారు బయలుదేరే సమయానికి బుడి బుడి అడుగులతో అక్కడికి చేరుకున్న చిన్నారిని కారు డ్రైవర్ చూసుకోలేదు. అతడు వాహనాన్ని ముందుకు పోనించడంతో కారు టైర్ల కింద పడి ఆ చిన్నారి ప్రాణాలు వదిలింది. ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద సంఘటన నిజామాబాద్ లో జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో అవి చూసిన వారంతా అయ్యో..అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తన కుటుంబంతో కలిసి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నివాసముంటున్నాడు. వాచ్ మెన్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే అపార్ట్‌మెంట్ లో నివసించే వారు వారి బైకులు, కార్లను పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే వాచ్ మెన్ కూతురు 18 నెలల చిన్నారి మనస్వి తమ ఇంటి ముందు సెల్లార్ లో రోజూ ఆడుకుంటూ ఉంటుంది. ఆదివారం కూడా చిన్నారి అనుకోకుండా పార్కింగ్ చేసిన కారు ముందు వెల్లి ఆడుకుంటూ కూర్చుంది. అంతలోనే అటుగా వచ్చిన ఓ వ్యక్తి కారెక్కి ఆ చిన్నారిని చూసుకోకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అది కాస్త ముందుకు వెల్లగానే చక్రాల కింద నలిగి మనస్వి నలిగి పోయింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. నిత్యం బుజ్జిబుజ్జి మాటలు చెప్పే చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పగవాడికి కూడా ఈ కష్టం రావొద్దంటూ గుండెలవిసేలా రోధిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారిస్తున్నారు.