Begin typing your search above and press return to search.

సర్పంచ్ చెప్పుతో కొట్టాడని... యువకుడి బలవన్మరణం !

By:  Tupaki Desk   |   8 Sept 2020 3:40 PM IST
సర్పంచ్ చెప్పుతో కొట్టాడని... యువకుడి బలవన్మరణం !
X
గ్రామ సర్పంచ్, అందరి ముందు తనను చెప్పుతో కొట్టాడన్న అవమానంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో సోమవారం అలజడి సృష్టించింది. అసలు ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. గ్రామ సర్పంచ్‌ ధరావత్‌ రమేష్‌ ఆదివారం తండాలో వీధి లైట్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి ముందు కూడా వీధిలైటు వేయాలని తండాకు చెందిన గుగులోతు ఎల్లేష్‌ సర్పంచ్ ‌ను అడిగాడు. నన్ను అడిగేందుకు నువ్వేవరివి అని సర్పంచ్‌ పేర్కొనడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగి పెద్ద గొడవగా పెరిగింది.

దీనితో సర్పంచ్ తీవ్ర ఆగ్రహంతో ఎల్లేష్ ను నలుగురి ముందూ చెప్పు తీసుకుని కొట్టాడు. ఆ అవమాన భారంతో ఇంటికి వెళ్లిన ఎల్లేష్, భార్యకు విషయం చెప్పి ఏడ్చాడు. ఆపై పురుగుల ముందు తాగాడు. దీన్ని గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఎల్లేష్ మరణించగా, సర్పంచ్ పై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ, బంధుమిత్రులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. చివరకు మృతుడి కుటుంబానికి 10 గుంటల భూమితో పాటు రూ. 30 వేల నగదును ఇప్పించేలా తండా పెద్దలు పంచాయతీ జరిపి, నచ్చజెప్పారు.