Begin typing your search above and press return to search.

నచ్చిందని , అత్యాచారం చేసి హత్య చేశాడు .. 10 నెలల తర్వాత పీఎస్ లో .. !

By:  Tupaki Desk   |   21 Oct 2020 1:40 PM IST
నచ్చిందని , అత్యాచారం చేసి హత్య చేశాడు .. 10 నెలల తర్వాత పీఎస్ లో .. !
X
ప్రస్తుతం తప్పు చేసినా కూడా ఆ కేసు నుండి ఎలా బయటపడాలా అని చూసుకునే రోజులు. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా కూడా ఆ కేసు నుండి క్షణాల వ్యవధిలో తప్పించుకొని , నాకేమి తెలియదు అని మంచితనం ముసుగులో తిరుగుతుంటారు. కానీ, ఓ నిందుతుడు మాత్రం .. 10 నెలల కిందట ..ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసి , ఆమె పై అత్యాచారం చేసి , ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని దారుణంగా హత్య చేశాడు. అయితే ఆ కామాంధుడిని పోలీసులు పట్టుకున్నా కూడా అసలు ఏ చిన్న సాక్ష్యం కూడా లేదు. దీనితో పోలీసులు కూడా ఏమీ చేయలేక అతన్ని వదిలేశారు. అలా పది నెలలు గడిచిన తర్వాత తాజాగా ఆ కామాందుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ రోజు ఆ మహిళను అత్యాచారం చేసి , చంపింది నేనే అంటూ లొంగిపోవడం తో పోలీసులు కూడా షాక్ అయ్యారు. అసలు ఏం జరిగింది అనే విషయంలోకి వెళ్తే ..

తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా వేలాంతంగల్ సమీపంలోని పెరనమల్లూర్ ప్రాంతంలో ఓ మహిళ నివాసం ఉంటున్నది. అనారోగ్యంతో గత ఏడాది భర్త మరణించాడు. భర్త మరణించిన తరువాత ఆ మహిళ అతని కొడుకుతో కలిసి జీవిస్తున్నది. లక్ష్మీకి సొంత పొలం ఉండటంతో కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్నది. ఆమె నివాసం ఉంటున్న గ్రామం సమీపంలోని రఘునాథ సముద్రం ప్రాంతంలో ఆమెకు పొలం ఉంది. పంటను రాత్రిపూట అడవి పందులు నాశనం చేస్తుండటంతో జనవరి 5వ తేదీన ఆ మహిళ ఇద్దరు కూలీలతో కలిసి పొలం దగ్గరకి పందులు పొలం లోకి రాకుండా చూసుకోవడానికి వెళ్ళింది. అర్దరాత్రి దాటిన తరువాత ఇద్దరు కూలీలు వారి ఇళ్లకు తిరిగి వెళ్లిపోవడంతో ఆ మహిళా ఒక్కటే ఉంది. అయితే మళ్ళీ రోజు ఉదయం ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె కొడుకు కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.

చివరికి వేరే వ్యక్తి పొలంలోని బావిలో లక్ష్మీ శవమై కనిపించడంతో ఆమె బంధువులు షాక్ కు గురైనారు. బంధువులు ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పెరనమల్లూర్ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. అదే సమయంలోఆమె పై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపి తరువాత బావిలో విసిరేశారని పోస్టుమార్టుం నివేదికలో వెలుగు చూసింది. అదే సమయంలో బంధువుల ఫిర్యాదు మేరకు వేలాంతంగల్ ప్రాంతానికే చెందిన నటరాజన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పది రోజులు విచారణ చేసినా కూడా అసలు అతనిని నుండి ఏ చిన్న క్లూ కూడా రాబట్టలేకపోవడంతో అతడు ఈ హత్య చేయలేదేమో అని భావించి వదిలేశారు. రెండు రోజుల క్రితం నటరాజన్ నేరుగా రెడ్డికుప్పం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ రోజు ఆ మహిళని తానే హత్య చేశానని, తనను వెంటనే అరెస్టు చెయ్యాలని చెప్పడంతో పోలీసులు షాక్ కు గురైనారు.

ఆ రోజు ఒంటరిగా పొలం లో ఉన్న ఆ మహిళ వద్దకి మద్యం మత్తులో వెళ్లానని, ఒంటరిగా ఉన్న విషయం గుర్తించి ఆమెపై అత్యాచారం చేశానని, పొలం దగ్గర ఆ సమయంలో కరెంట్ సరఫరా లేకపోవడంతో ఆ విషయం ఎవ్వరూ గుర్తించలేకపోయారని నటరాజన్ పోలీసులకు చెప్పాడు. లక్ష్మీ జరిగిన విషయం ఎక్కడ ఊర్లో చెబుతుందో అనే భయంతో ఆమె గొంతు నులిమి చంపేసి బావిలో విసిరేశానని నటరాజన్ పోలీసులకు చెప్పాడు. నటరాజన్ స్వయంగా నేనే లక్ష్మీని రేప్ చేసి చంపేశానని అంగీకరించడంతో పోలీసులు కూడా చేసిది ఏమీలేక అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఏదేమైనా పది నెలల తర్వాత , ఆ పని చేసిన వాడే స్వయంగా వచ్చి పోలీసులకి లొంగిపోవడంతో , ఆ మహిళ దెయ్యంగా మారి అతన్ని చిత్ర హింసలు పెట్టి ఉంటుంది అని , అందుకే వచ్చి లొంగిపోయి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.