Begin typing your search above and press return to search.

అంద‌రి ముందూ బ‌ట్ట‌లు విప్పేసిన మ‌హిళ‌.. అండ‌ర్ వేర్ కూడా..! ఇదంతా విమానంలో.. ఫ్లైట్‌ గాల్లో!

By:  Tupaki Desk   |   10 March 2021 4:30 AM GMT
అంద‌రి ముందూ బ‌ట్ట‌లు విప్పేసిన మ‌హిళ‌.. అండ‌ర్ వేర్ కూడా..! ఇదంతా విమానంలో.. ఫ్లైట్‌ గాల్లో!
X
ఓ మ‌హిళ అంద‌రూ చూస్తుండ‌గా.. త‌న దుస్తులు ఒక్కొక్క‌టిగా విప్పేయ‌డం మొద‌లు పెట్టింది..! చూస్తున్న వారికి ఏం జ‌రుగుతోందో అర్థం కాలేదు. టాప్ టూ బాట‌మ్ మొత్తం తీసేసింది. అండ‌ర్ వేర్ కూడా విప్పేసింది. దీంతో.. కొంద‌రు క‌ళ్లు మూసుకుంటే.. మ‌రికొంద‌రు త‌ల తిప్పుకున్నారు! ఇదంతా జ‌రిగింది విమానంలో! అప్పుడు ఫ్లైట్ ఉన్న‌ది గాల్లో!

ర‌ష్యా విమానంలో చోటు చేసుకుందీ ఘ‌ట‌న‌. వ్లాదివోస్తోక్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఓ విమానంలో స‌ద‌రు మ‌హిళ ఈ ప‌ని చేసింది. త‌న దుస్తులు విప్పుతూ.. మ‌ళ్లీ వేసుకుంటూ.. మ‌ళ్లీ విప్పుతూ ఉంది. ఇది చూసిన ప్రేక్ష‌కులు విస్తుపోయారు. ఎయిర్ హోస్టెస్ ఆమె వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకొచ్చిన‌ప్ప‌టికీ.. ఎలా నిలువ‌రించాలో అర్థం కాలేదు. వారు ఎంత చెబుతున్నా వినిపించుకోలేదు స‌ద‌రు మ‌హిళ‌!

కార‌ణం ఏమంటే.. ఆమె మ‌త్తులో ఉంది. విప‌రీతంగా డ్ర‌గ్స్ తీసుకోవ‌డం ద్వారా కాన్సియ‌స్ లో లేకుండాపోయింది. ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో.. చివ‌ర‌కు ఆమె సీటులోనే తాళ్ల‌తో బంధించాల్సి వ‌చ్చింది. విమానం ల్యాండ్ అయిన త‌ర్వాత పోలీసుల ఆధ్వ‌ర్యంలో ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.