Begin typing your search above and press return to search.

సొంత బాబాయ్ ను దారుణంగా చంపేసిన వీడి బలుపు మాటలు విన్నారా?

By:  Tupaki Desk   |   26 Aug 2021 3:30 AM GMT
సొంత బాబాయ్ ను దారుణంగా చంపేసిన వీడి బలుపు మాటలు విన్నారా?
X
ఆస్తి విషయంలో నెలకొన్న విభేదాలు ఒక ప్రాణాల్ని దారుణంగా తీసేసిన వైనం ప్రకాశం జిల్లాలోచోటు చేసుకుంది.ఆస్తుల గొడవలు.. ప్రాణాలు పోవటం కొత్తేం కాకున్నా.. తాజా ఉదంతంలో నిందితుడి వైఖరి హాట్ టాపిక్ గా మారింది. ఆస్తి కోసం బాబాయ్ ను చంపేశా.. ఇప్పుడేంటి? అంటూ ప్రశ్నించటమే కాదు.. అయితే.. నేను పారిపోవాలా? మర్డర్ చేసి ఇక్కడే ఉన్నా అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వైనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దారుణంగా చంపేయటమే కాదు.. అక్కడే నిలబడి మాట్లాడుతున్న అతడి బలుపు మాటలు విస్మయానికి గురయ్యేలా చేస్తోంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల ప్రభుత్వ మద్యం షాపు వద్ద చోటు చేసుకున్న దారుణ హత్యోదంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెను సంచలనంగా మారింది. చనిపోయిన వ్యక్తిని కనిగిరి మండలం యడవల్లి గ్రామానికిచెందిన 48 ఏల్ల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అదే గ్రామానికి చెందిన అతడి రెండో అన్న నారాయణ కుటుంబంతో ఉన్న ఆస్తి తగాదాలే ఆయన హత్యకు కారణంగా భావిస్తున్నారు.

వెంకటేశ్వరరావుకు ఆయన రెండో అన్న నారాయణ కుటుంబానికి ఆస్తి తగాదాలు ఉన్నాయి.దీంతో.. తమ ఆస్తుల వివాదాన్ని పరిష్కరించాలంటూ ప్రభుత్వం నిర్వహించే స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ చేసి వచ్చాడు. దీంతో.. అధికారులు వచ్చి విచారణ చేపట్టారు. దీంతో ద్వేషం పెంచుకున్ననారాయణ కుమారుడు పుల్లారావు దారుణమైన ప్లాన్ వేశాడు. మాట్లాడుకుందామని వెంకటేశ్వరరావును పెదారికట్లకు తీసుకెళ్లాడు. అక్కడ ప్రభుత్వ మద్యం షాపు దగ్గర మద్యం కొనుగోలు చేసి తాగాడు. అనంతరం అక్కడే గొడవ పడ్డాడు.

తీవ్రఆగ్రహానికి లోనై.. మద్యం సీసాను పగులగొట్టి బాబాయ్ గొంతులో పొడిచి ప్రాణాలు తీశాడు. పథకం ప్రకారమే హత్య చేసిన ఇతడి వైనం స్థానికంగా సంచలనంగా మారింది. బాబాయ్ చంపేసిన దగ్గరే నిలచొని.. భయం భయంగా ఈ ఉదంతాన్ని చూస్తున్న వారిని ఉద్దేశించి.. అవును.. చంపేశా. అయితే.. పోలీసులకు లొంగిపోవాలా? అంటే చెప్పాడు. కాసేపు అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్లిపోయాడు. అతడి మాటల్ని రికార్డు చేసిన పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హత్య చేసిన తర్వాత కనిపించకుండా పోయిన ఇతగాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.