Begin typing your search above and press return to search.
ప్రేమకు అడ్డొస్తున్నాడని.. ప్రియురాలి అన్నను చంపేశాడు.. నోయిడాలో యూ ట్యూబర్ దారుణం
By: Tupaki Desk | 4 Nov 2020 9:15 AM ISTఅతడో యూ ట్యూబర్. అద్భుతంగా బైక్‌పై విన్యాసాలు చేస్తుంటాడు. ఓ యూట్యూబ్ చానల్ ను స్టార్ట్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. యూట్యూబ్‌లో 9 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అతడు చేసే బైక్ విన్యాసాలకు ప్లాట్ అయిన యువతి అతడిని ప్రేమించింది. వీరి ప్రేమకు యువతి సోదరుడు అడ్డు చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన యూ ట్యూబర్ .. బైక్‌పై వెంబడించి ప్రేయసి సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నొయిడాలో వెలుగు చూసింది.
నొయిడాకు చెందిన నిజాముల్ ఖాన్ తన యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ వీడియోలనే బతుకు దెరువుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో నోయిడాకు చెందిన ఓ యువతి పరిచయమైంది. తరుచూ ఆమెను కలుస్తుండేవాడు. విషయం తెలుసుకున్న యువతి సోదరుడు కమల్ శర్మ(26) తన సోదరితో మాట్లొద్దని హెచ్చరించాడు. కక్ష పెంచుకున్న నిజాముల్ ఖాన్.. ఎలాగైనా అతడిని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. అక్టోబరు 28న కమల్ శర్మ ఇస్కాన్ టెంపుల్ గుండా వెళ్తుండగా.. మోటార్ సైకిల్ మీద వెంబడించి తుపాకీతో కాల్పులు జరిపాడు. బులెట్ గాయంతో రోడ్డు మీద పడిఉన్న కమల్‌ను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కమల్ సోదరుడు నరేశ్ శర్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిజాముల్ ఖాన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. యూట్యూబ్ వీడియోల ద్వారా వచ్చిన డబ్బు ఆశచూపి ఈ తన స్నేహితులతో కలసి ఘాతుకానికి పాల్పడ్డట్టు తేల్చారు. ఈ కేసులో పోలీసులు నిజాముల్ఖాన్తో పాటు అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు. మృతుడి సోదరికి కూడా ఈ హత్యతో ఏమన్నా సంబంధం ఉన్నదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.