Begin typing your search above and press return to search.

నైజీరియాలో దారుణం ... 400 మంది విద్యార్థులు, ఇద్దరు భారతీయులు కిడ్నాప్ !

By:  Tupaki Desk   |   14 Dec 2020 11:13 AM IST
నైజీరియాలో దారుణం ...  400 మంది విద్యార్థులు, ఇద్దరు భారతీయులు కిడ్నాప్  !
X
నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. నైజీరియా ప్రతి నిత్యం కూడా ఎదో ఒక సంఘటన తో అట్టుడుకుతుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలపై దాడికి తెగబడిన బందిపోట్లు 400 మంది విద్యార్థులను ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన విద్యార్థుల కోసం నైజీరియన్ ఆర్మీ వెతుకులాట ప్రారంబించింది. జీరియాలోని కట్సినా రాష్ట్రంలో మారణాయుధాలు కలిగిన మిలిటెంట్లు భారీ సంఖ్యలో వచ్చి ఓ ప్రభుత్వ స్కూల్‌ పై ఒక్కసారిగా దాడి చేశారు. దాదాపు 400 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. ఆ స్కూల్ ‌లో మొత్తం 600 మంది విద్యార్థులు ఉండగా, 200 మంది ఆ బందిపోట్ల నుండి తప్పించుకోగలిగారు.

అయితే, ఈ ఘటన గురించి ముందే తెలుసుకున్న నైజీరియన్ భద్రతా బలగాలు సంబంధిత స్కూల్ వద్దకు చేరుకున్నారు. బందిపోట్లపై ఎదురు దాడికి దిగారు. దానితో 200 మంది విద్యార్థులు వారి చెర నుండి తప్పించుకున్నారు. కాగా, మొత్తం మీద ఆ బందీపోట్లు 400 మంది విద్యార్థులను ఎత్తుకుపోవడంతో సదరు విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కావడంలేదు.

ఇదిలా ఉంటే నైజీరియా లోనే ఇద్దరు భారతీయులు కిడ్నాప్ కి గురయ్యారు. వారు పనిచేస్తున్న ఫార్మ కంపెనీ నుంచి వస్తుండగా బుధవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకితో బెదిరించి ఇద్దరిని కిడ్నాప్ చేశాడు. నైరుతి నైజీరియాలోని ఓయో రాష్ట్ర రాజధాని ఇబదాన్‌ లో ఈ ఘటన జరిగింది. దీనితో విదేశీ పౌరులు అప్రమత్తంగా ఉండాలని నైరుతి నైజీరియా పోలీసులు ఆదివారం హెచ్చరికలు జారీచేశారు. ఘటనపై నైరుతి నైజీరియా పోలీస్ విభాగం అధికార ప్రతినిధి ఓల్గ్ ‌బెంగ్ ఫెడేయ్ మాట్లాడుతూ.. కిడ్నాప్‌ కు గురయిన భారతీయులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వీరు ఎక్కడ ఉన్నారనేది, ఎవరు కిడ్నాప్ చేశారనేది ఇంకా తెలియరాలేదన్నారు. బాధిత కుటుంబాలతో కిడ్నాపర్లు సంప్రదించారా, అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే, విదేశీ పౌరులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచించారు.