Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో దారునం...ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలు !

By:  Tupaki Desk   |   28 April 2021 11:00 AM IST
మహారాష్ట్రలో దారునం...ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలు !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ పెరిగేకొద్ది ఎన్నో హృదయ విదారక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కరోనా సోకి మృతిచెందిన వారికి కనీస మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న కోర్టుల ఆదేశాలు దాదాపు ఎక్కడా అమలు కావడంలేదు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో అయితే ఈ పరిస్థితి అసలు కనిపించడం లేదు. ఒకే అంబులెన్స్‌లో ఏకంగా 22 మృతదేహాలు కుక్కి తరలిస్తున్న ఘటన పై తీవ్ర స్థాయిలో విచుకుపడుతున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ ఘటనను చూపించవచ్చు.

వివరాల్లోకి వెళ్తే .. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబజోగైలో ఉన్న స్వామి రామనంద తీర్థ్‌ గ్రామీణ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉంచిన మృతదేహాలను ఆదివారం ఈ విదంగా శ్మశానానికి తరలించారు. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో వైద్య కళాశాల డీన్‌ డాక్టర్‌ శివాజీ శుక్రే మంగళవారం మీడియాకు వివరణ ఇచ్చారు. మృతదేహాలను తరలించేందుకు ఆసుపత్రి యంత్రాంగం వద్ద తగినన్ని అంబులెన్స్‌లు లేవని, గతేడాది కరోనా తొలి దశ ఉద్ధృతి సమయంలో 5 అంబులెన్స్‌ లు ఉండేవని, తరువాత మూడింటిని ఉపసంహరించారని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉన్న రెండు అంబులెన్స్‌ లలోనే కరోనా బాధితులను, మృతదేహాలను తరలిస్తున్నట్లు తెలిపారు. కొన్ని సందర్భాల్లో కరోనా కారణంగా మరణించిన వారి బంధువులను గుర్తించడమూ కష్టంగా ఉంటోందని, లోఖాండీ సవర్‌గావ్‌ గ్రామంలో ఫ్రీజర్ లేని కారణంగా అక్కడి నుంచి కూడా మృతదేహాలను తమ కాలేజీకే పంపిస్తున్నారని శివాజీ శుక్రే తెలిపారు. తమకు మరో మూడు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా గత నెల 17న జిల్లా యంత్రాంగానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని అయన తెలిపారు . ఏదేమైనా ఈ ఘటనను ప్రతి ఒక్కరూ కూడా తప్పుబడుతున్నారు.