Begin typing your search above and press return to search.

అత్యాచారం యత్నంలో సంచలనం.. బాధితురాలు కొడవలి చేతబట్టి కోసేసింది!

By:  Tupaki Desk   |   20 March 2021 1:05 PM GMT
అత్యాచారం యత్నంలో సంచలనం.. బాధితురాలు కొడవలి చేతబట్టి కోసేసింది!
X
భ‌ర్త ఊరు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండ‌గుడు ఆమెపై క‌న్నేశాడు. ఇంట్లో ఒంట‌రిగా నిద్రిస్తున్న మ‌హిళ‌పై అత్యాచారానికి య‌త్నించాడు. ఊహించ‌ని ఘ‌ట‌న‌తో ఉలిక్కిప‌డిన స‌ద‌రు మ‌హిళ నిందితుడితో పెనుగులాడింది. ఎంత సేప‌టికీ నిందితుడు ఆమెను వ‌ద‌ల్లేదు.

దీంతో.. కాసేప‌టి త‌ర్వాత అందుబాటులో కొడ‌వ‌లి క‌నిపించింది. త‌న‌ మాన‌ప్రాణాల‌ను కాపాడుకునేందుకు వెంట‌నే కొడ‌వ‌లి తీసుకున్న బాధితురాలు నిందితుడి మ‌ర్మాగాన్ని కోసిప‌డేసింది. ఆ త‌ర్వాత అదే రోజు రాత్రి పోలీసు స్టేష‌న్ కు వెళ్లిన మ‌హిళ‌ నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో జ‌రిగింది.

ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల‌ను ఖాదీ ప్రాంతానికి చెందిన ఎస్సై ధ‌ర్మేంద్ర సింగ్ రాజ్ వెల్ల‌డించారు. నిందితుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన త‌ర్వాత అత‌డిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. అయితే.. నిందితుడు కూడా బాధితురాలిపై కేసు పెట్టిన‌ట్లు తెలిపారు. దీంతో ఆమెపై 327 సెక్ష‌న్ ప్ర‌కారం కేసు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

ఇదిలాఉండ‌గా.. ఈ ఘ‌ట‌న‌లో స్థానికులు బాధితురాలికి మ‌ద్ద‌తుగా నిలిచారు. నిందితుడికి త‌గిన‌శాస్తి జ‌రిగింద‌ని అంటున్నారు. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డే ఇలాంటి వారికి ఇలాంటి శిక్షే స‌రైన‌ద‌ని అంటున్నారు. అప్పుడే.. ఇత‌ర మృగాల‌కు కూడా భ‌యం ఉంటుంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.