Begin typing your search above and press return to search.
మార్చురీలోని మృతదేహం లేచి కూర్చుంది.. పరుగులు తీసిన సిబ్బంది
By: Tupaki Desk | 30 Nov 2020 12:30 PM ISTఓ ఆస్పత్రి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. ఓ వ్యక్తి బతికుండగానే చనిపోయాడని నిర్ధారించి మార్చురీకి పంపించిన వైనమిది. చనిపోయాడనుకుని బంధువుల రోధనలు మిన్నంటిన వేళ. అంత్యక్రియల కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి మార్చురీలో కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు. శవం తిరిగిలేచిందని ఆస్పత్రి సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఓ నర్స్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. నిజానికి ఆ వ్యక్తి చనిపోలేదు. కానీ చనిపోయారని భావించి మార్చురీకి తరలించారు. ఈ ఘటన కెరిచో దేశంలో చోటుచేసుకున్నది.కెరిచోకు చెందిన పీటర్ కైగెన్ (32) కడుపు నొప్పితో బాధపడుతూ కప్లాటెట్ అనే ఆస్పత్రిలో చేరాడు. అయితే రెండ్రోజులు ఆస్పత్రిలో చికిత్స నందించారు. కానీ మూడోరోజు నర్స్ వచ్చి పీటర్ చనిపోయాడని బాధిత కుటుంబానికి చెప్పింది. దీంతో సిబ్బంది అతడిని మార్చురీ గదిలోకి తరలించారు.
అంత్యక్రియలు జరిపేవరకు అతడి శరీరం కుళ్లిపోకుండా ఉండేందుకు సిబ్బంది ఎంబాలింగ్ ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా అతడి శరీరం నుంచి రక్తాన్ని వేరుచేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ క్రమంలో నొప్పి భరించలేక పీటర్ కేకలు పెట్టాడు. సిబ్బంది పరుగులు పెట్టారు. తర్వాత వేరే డాక్టర్లు అక్కడికి చేరుకొని పీటర్ బతికే ఉన్నాడని నిర్ధారించి అతడికి చికిత్స ప్రారంభించారు.
ఈ విషయంపై కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ‘మొదట పీటర్ చనిపోయారని ఆస్పత్రి వాళ్లు చెప్పారు. మేం ఎంతో రోధించాం. ఆ తర్వాత పీటర్‌ను మార్చురీలోకి తరలించారు. కొద్ది సేపయ్యాక మార్చురి సిబ్బంది పరుగులు పెట్టడం గమనించి మేం లోపలికి వెళ్లాం. అప్పడు పీటర్ శరీరంలో కదలికలు మొదలయ్యాయి. ఆ తర్వాత అతడు కళ్లు తెరిచాడు. డాక్టర్ అతడికి వైద్యం తిరిగి ప్రారంభించారు. ఇదంతా ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే జరిగింది. బతికి ఉన్న వ్యక్తిని చనిపోయాడని ఎలా నిర్ధారిస్తారు’ అంటూ వారు పేర్కొన్నారు. పీటర్ మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు స్పృహ కోల్పోయానో.. ఎప్పుడు మేల్కొన్నానో కూడా నాకు తెలియదు. నన్ను బతికించిన డాక్టర్లకు, దేవుడికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.