Begin typing your search above and press return to search.

2018లో జరిగిన మర్డర్ చేస్తే 2021లో పోలీసులకి చిక్కారు.. ఎలా అంటే ?

By:  Tupaki Desk   |   13 March 2021 9:38 AM GMT
2018లో జరిగిన మర్డర్ చేస్తే 2021లో పోలీసులకి చిక్కారు.. ఎలా అంటే ?
X
దృశ్యం ... విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం. మంచి కథ , అంతకు మించిన స్క్రీన్ ప్లే తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. హీరో కుటుంబాన్ని నాశనం చేయాలనుకే యువకుడిని చంపి , ఆ కేసు నుండి ఎలా బయటపడ్డారు అనేది కథ. హీరో ఆ హత్య చేశాడు అని బలంగా పోలీసులు అనుకున్నా కూడా దానికి తగ్గ సాక్ష్యాలు తారుమారు చేయడంలో హీరో సూపర్ సక్సెస్ అవ్వడంతో కథ ఓ మిస్టరీగానే ముగిసిపోతుంది. సేమ్ టు సేమ్ అదే సీన్ తాజాగా ఇల్లందు లో రిపీట్ అయింది. 2018లో జరిగిన మర్డర్ చేస్తే 2021లో పోలీసులకి చిక్కారు.

వివరాల్లోకి వెళ్తే .. 2018 లో విజయ్ కుమార్ అనే ఓ యువకుడు జులాయిగా తిరిగేవాడు. నిత్యం గొడవలు పడుతూ పోలీస్ స్టేషన్స్ వెంబడి తిరిగేవాడు. అలాగే , ఇల్లెందుకు చెందిన మరో ముఠాతో ఇతడికి ఎప్పుడూ గొడవలే. దీనితో ఆ ముఠా సభ్యులు సరైన సమయం కోసం ఎదురుచూశారు. ఆ సమయం రానే వచ్చింది. ఓరోజు విజయ్ కుమార్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వద్ద ఒంటరిగా దొరికాడు. అదను కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థి గ్యాంగ్ కు చెందిన కమ్ము, కమల్, పాసి లు విజయ్ కుమార్ పై దాడికి దిగి చంపేసి , దగ్గర్లోని స్మశానం లో పాతిపెట్టారు. ఇది జరిగి రెండేళ్లు అయినా పోలీసులు ఛేదించకలేకపోయారు.

దీన్ని కాసేపు పక్కన పెడితే .. తాజాగా ఇల్లెందులోని ఓ ఎంపీటీసీ సభ్యుడిపై హత్యాయత్నం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. వారిని విచారణ చేస్తున్న సమయంలో ఓ అనుమానితుడు విజయ్ కుమార్ హత్య వివరాల్ని బయటపెట్టాడు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు. కమ్ము, కమల్, పాసిలను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారు చెప్పిన విధంగా స్మశానంలో తొవ్వి చూస్తే విజయ్ కుమార్ అస్తికలు, ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆనవాళ్లు ఆధారంగా అది విజయ్ కుమారేనని కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. మొత్తంగా 2018 లో జరిగిన ఓ మర్డర్ కేసు అనూహ్య రీతిలో ఎవ్వరు ఊహించని విదంగా పోలీసులు 2021 లో సాల్వ్ చేశారు. ఇక్కడ దృశ్యం సినిమా తరహా స్క్రీన్ ప్లే చేసినా కూడా మరో తప్పు చేయడంతో దొరికిపోయారు.