Begin typing your search above and press return to search.

ఢిల్లీలో దిగ్భ్రాంతికర ఘటన ... కారు బానెట్ ‌పై ట్రాఫిక్‌ పోలీస్ !

By:  Tupaki Desk   |   15 Oct 2020 6:40 PM IST
ఢిల్లీలో దిగ్భ్రాంతికర ఘటన ... కారు బానెట్ ‌పై ట్రాఫిక్‌ పోలీస్ !
X
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ట్రాఫిక్‌ పోలీసు ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఒక కారు డ్రైవర్ ప్రవర్తించాడు. ఢిల్లీలోని కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించటమే కాకుండా, ట్రాఫిక్‌ పోలీస్ ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగాప్రవర్తించాడు ఓ కారు డ్రైవర్.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... సౌత్‌ వెస్ట్‌ ఢిల్లీ, కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి, దౌలా కౌన్ ‌లోని ఓ రోడ్డుపై ట్రాఫిక్‌ రూల్స్ పాటించని ఒక కారును ఆపేందుకు మహిపాల్ సింగ్ అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ కారును ఆపాల్సింది పోయి , కారుని ఆపకుండా వెహికిల్‌‌ ను ఏకంగా‌ ట్రాఫిక్‌ పోలీస్‌ మహిపాల్‌‌ మీదకు పోనిచ్చాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు కారు బానెట్ ‌పై పడిపోయాడు. మహిపాల్ సింగ్ బానెట్‌ పై వేలాడుతూ కారును ఆపమంటూ అరవసాగాడు. అయినప్పటికి డ్రైవర్‌ కారును ఆపకుండా రద్దీ రోడ్డుపై అలాగే పోనిచ్చాడు.

పోలీసు కారు బానెట్‌పై పడిపోయాడు. బానెట్‌ పై వేళ్లాడుతూ.. కారును ఆపమంటూ అరవసాగాడు. అయినప్పటికి డ్రైవర్‌ కారును ఆపకుండా, పోలీస్‌ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న కనికరం లేకుండా రద్దీ రోడ్డుపై అలాగే పోనిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత సదరు పోలీసు రోడ్డుపై కిందపడిపోగా డ్రైవర్‌ కారు వేగాన్ని పెంచి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సౌత్ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌‌‌కు చెందిన శుభమ్‌‌ గా పోలీసులు గుర్తించారు.