Begin typing your search above and press return to search.
శాడిస్టు బాసు.. కరోనా వచ్చినా లీవ్ ఇవ్వలే .. బ్యాంకు మేనేజర్ దుర్మరణం
By: Tupaki Desk | 16 Sept 2020 9:00 AM ISTఅతడో శాడిస్ట్ బాసు.. నిరంతరం తన కింద పనిచేసే ఉద్యోగులను వేపుకు తింటుంటాడు. కరోనా వచ్చిన ఓ ఉద్యోగికి సెలవు మంజూరు చేయలేదు. ఏ మాత్రం దయ లేకుండా అతడి తో పనిచేయించుకున్నాడు. సకాలంలో చికిత్స అందక ఆ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనిపై దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కృష్ణా జిల్లా లక్ష్మి పురం ఎస్బీఐ బ్రాంచ్ లో రాజేశ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆగస్ట్ 25 నుంచి అతడు తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాడు. అదే బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేసే ఓ వ్యక్తికి కరోనా సోకింది. దీంతో అతడికి రాజేశ్ సెలవు మంజూరుచేశాడు. తనకు కరోనా లక్షణాలు కనిపించడం తో రాజేశ్ కూడా సెలవు కోసం ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. రాజేశ్ లీవ్ రిక్వెస్ట్ ను రీజినల్ మేనేజర్ తిరస్కరించాడు. బ్యాంకులో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నందున లీవ్ కుదరదని చెప్పాడు. దీంతో రాజేశ్ అనారోగ్యం తోనే విధులకు హాజరయ్యాడు.
సెప్టెంబర్ 1న తీవ్ర అనారోగ్యానికి లోను కావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. తనకు కరోనా వచ్చిన విషయం ఉన్నతాధికారులకు చెప్పినప్పటికీ వారు లీవ్ ఇవ్వలేదు. దీంతో రాజేశ్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. చికిత్స కోసం అతను కాకినాడలోని జీజీహెచ్ ఆస్పత్రిలో చేరారు. అక్కడినుంచే ఆన్‌లైన్‌లో రివ్యూ మీటింగ్‌లకు హాజరవాలని రీజినల్ మేనేజర్ ఆదేశించారు. దీంతో రాజేష్ ఆస్పత్రి నుంచి కూడా పనిచేశాడు. రివ్యూ మీటింగ్ లో ఉన్నతాధికారులు వేధించారు ఈ ఒత్తిడి తట్టుకో లేక సెప్టెంబర్ 11 న రాజేవ్ మృతి చెందాడు. ప్రస్తుతం ఈ ఘటన పై బ్యాంకు సంఘాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. సదరు ఉన్నతాధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.