Begin typing your search above and press return to search.
ఆస్తి కోసం ఇద్దరు తమ్ముళ్లని ఓ అన్న ఏంచేసాడంటే ?
By: Tupaki Desk | 8 Oct 2020 4:30 PM ISTఈ సమాజంలో రోజురోజుకి డబ్బు పై ఉన్న వ్యామోహం పెరిగిపోతుంది. బంధుత్వం , ప్రేమలు , ఆప్యాయతలు కేవలం రాయడానికి , బుక్స్ లో మాత్రమే మిగిలిపోతున్నాయి. డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్నాన్న ఆస్తి కోసం కొట్టేయాలని ప్లాన్ వేసిన ఓ ప్రబుద్దుడు , దానికి అడ్డుగా ఉన్న ఇద్దరు సోదరులను దారుణంగా హతమార్చేందుకు ప్రయత్నం చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన రాము చిన్నపిల్లలైన తన చిన్నాన్న ఇద్దరు కొడుకులని ప్రేమగా పిలిచి , చాక్లెట్లు కొనిస్తానని నమ్మించి బయటకు తీసుకెళ్లాడు. పిల్లలు ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అనుమానంతో రాముని ప్రశ్నించగా ఇద్దరు చిన్నారులను రాళ్లతో కొట్టి కాలువలో తోసేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
కూడేరు సమీపంలో శశిధర్ ప్రాణాపాయస్థితిలో కన్పించాడు. మరో చిన్నారి మోక్షజ్ఞ కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. చిన్నాన్న ఆస్తి కోసమే ఇద్దరు తమ్ముళ్లని కిడ్నాప్ చేసినట్లు రాము పోలీసులకు చెప్పిన్నట్లు సమాచారం. ఇద్దరు పిల్లలు చనిపోతే చిన్నాన్న వాటా కింద ఉన్న 10 ఎకరాల పొలం తనకే వస్తుందన్న దురాశతో ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు.