Begin typing your search above and press return to search.
ఉద్యోగం చేయడమూ తప్పేనంట..కన్న కూతురిని కాల్పించాడు
By: Tupaki Desk | 11 Nov 2020 5:00 AM ISTఆఫ్ఘనిస్థాన్ లో మహిళలపై అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూతురు ఉద్యోగం చేయడం లేని ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్నకూతురు అని చూడకుండా ఆమెపై కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల్లో ఆమె తన రెండు కళ్లను కోల్పోయింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఘజ్ని ప్రావిన్స్‌కు చెందిన ఖతేరాకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని పోలీస్ అధికారి కావాలని కలలుగనేది. కానీ ఆమె తండ్రికి మాత్రం ఆడవాళ్లు చదువుకోవడం, ఉద్యోగం చేయడం ఇష్టం ఉండేది కాదు. కానీ ఖతేరా తన తండ్రిని ఒప్పించి చదువుకున్నది. కానీ ఉద్యోగం చేసేందుకు మాత్రం తండ్రి ఒప్పుకోలేదు. వెంటనే పెళ్లి చేశాడు. ఖతేరా భర్త మాత్రం ఆమె ఉద్యోగం చేసేందుకు ఒప్పుకోవడం తో ఆమె బాగా చదువుకొని ఉద్యోగం సాధించింది. కొద్ది నెలల క్రితం అప్ఘనిస్తాన్ లోని ఘజ్ని ప్రావిన్స్ లోని పోలీసు స్టేషన్ లో క్రైమ్ బ్రాంచ్ లో అధికారిగా చేరారు. ఎంతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తుండేవారు.
కానీ తండ్రి మాత్రం ఖతేరా ను ఉద్యోగం మానేయాలని తీవ్రమైన ఒత్తిడి చేసేవాడు. తరచూ ఆమెను బెదిరించేవాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఖతేరా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా.. ముగ్గురు దుండగులు ఆమె మీద దాడి చేశారు. కత్తితో గాయ పర్చడమే కాక కాల్పులు జరిపి ఆమె కళ్లు పోయేలా చేశారు. తీవ్ర గాయాల తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఖతేరాని ఆస్పత్రి లో చేర్చారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది కానీ జరిగిన దాడిలో ఆమె చూపు కోల్పోయింది. ఫలితంగా ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ముందు ఈ దాడిని తాలిబన్లు చేసి ఉండొచ్చని పోలీసులు భావించారు. కానీ ఖతేరా తన తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.