Begin typing your search above and press return to search.
మాచర్లలో దారుణం: మరణించిన తల్లి నగలు తీసుకెళ్లి.. ఆమెను వదిలేశారు
By: Tupaki Desk | 26 Aug 2020 4:20 PM ISTమానత్వానికి మచ్చ తెచ్చే ఉదంతం ఏపీలో చోటు చేసుకుంది. కని పెంచిన తల్లి విషయంలో పిల్లలు వ్యవహరించిన తీరు మానవత్వానికి.. మానవ సంబంధాల మీద కొత్త సందేహాలు కలిగే పరిస్థితి. గుంటూరు జిల్లా మాచర్లలో చోటు చేసుకున్న ఈ వైనం తెలిసిన వారంతా ఆ పిల్లల్ని చీదరించుకుంటున్నారు. మాచర్ల మండలానికి చెందిన ఒక పెద్దావిడకు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. దీంతో.. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు నలుగురు కొడుకులు.. ఒక కుమార్తె.
ఇదిలా ఉంటే.. సమస్య తీవ్రత పెరగటంతో ఆమె ఆదివారం మరణించారు. కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె మృత దేహాన్ని మార్చురీలో ఉంచారు. తల్లి మృతదేహాన్ని చూసేందుకు మార్చురీకి వచ్చిన కన్నబిడ్డలు.. ఆమె ఒంటిమీద ఉన్న బంగారు నగల్ని తీసుకొని వెళ్లిపోయారు.
మృతదేహాన్ని తమతో తీసుకెళ్లలేదు. ఆమె అంత్యక్రియల గురించి అధికారులు ఆరా తీయగా.. ఆమె కన్నబిడ్డల ఫోన్లుస్విచాఫ్ చేసి ఉండటంతో ఏం చేయాలో తోచలేదు. మృతదేహాం మీద ఉన్న బంగారు నగల అవసరం ఉన్న పిల్లలు.. తల్లి అంత్యక్రియల విషయాన్ని అలా వదిలేసి వెళ్లటం విస్మయానికి గురి చేస్తోంది. ఎంత కరోనా అయితే మాత్రం మరీ.. ఇంత దారుణమా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.