Begin typing your search above and press return to search.
కాసేపట్లో పెళ్లి.. బైక్ మీద వెళుతున్న అతడు అలా చనిపోవటం ఏంటి?
By: Tupaki Desk | 13 Oct 2020 1:40 PM ISTరోజులు మారిపోయాయి. ప్రమాదాలు పెరిగిపోయాయి. మనం ఎంత జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతుంటే సరిపోదు. మన ముందోడు.. వెనకోడు.. పక్కనోడు అందరూ జాగ్రత్తగా బండి నడపకుంటే ఎన్ని తిప్పలన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపే ప్రమాదం ఒకటి చౌటుప్పల్ లో చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ కు చెందిన వీడియో ఫుటేజ్ చూసినోళ్లకు షాక్ కావటం ఖాయం. అంతేకాదు.. కాస్త జాగ్రత్తపరులైతే..రోడ్డు మీదకు రావటానికి కూడా ఇష్టపడరు. షాకింగ్ గా మారిన ఈ ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది.
హైదరాబాద్ హయత్ నగర్ కు చెందిన నాగరాజు.. శ్రీలతలు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వారు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇందులో భాగంగా టూ వీలర్ మీద నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు ఆలయానికి బయలుదేరారు. కాసేపట్లో వారు ఆలయానికి చేరుకునే పరిస్థితి. ఇంతలోనే చోటు చేసుకున్న అనూహ్య ప్రమాదం నాగరాజు ప్రాణాల్ని తీసింది. తన పాటికి తాను రోడ్డు నిబంధనల్ని పాటిస్తూ ఉండటమే అతడి ప్రాణాల్ని తీయటం ఈ ఎపిసోడ్ లో అత్యంత విషాదంగా చెప్పాలి.
చౌటుప్పల్ హైవే సిగ్నల్స్ రెడ్ పడటంతో తన బైక్ ను ఆపారు. గ్రీన్ సిగ్నల్ పడి.. నాగరాజు ముందున్న వాహనం ఒక్కొక్కటి నెమ్మదిగా కదులుతున్న వేళ.. వెనుక నుంచి అమితమైన వేగంతో వచ్చిన బ్రీజా కారు నాగరాజు నడుపుతున్న బైక్ ను బలంగా ఢీ కొట్టి ముందుకు వెళ్లింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో బైక్ లో మంటలు చెలరేగాయి. బైక్ పూర్తిగా కాలిపోగా.. అందులో నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు చనిపోగా.. అతనితో పాటు ఉన్న శ్రీలత.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సీసీ ఫుటేజ్ చూడగా.. కారు నడుపుతున్న డ్రైవర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. సిగ్నల్ పడినప్పుడు బ్రేకులు ఫెయిల్ కావటం అన్నది ఉండదు. నిజంగానే బ్రేక్ ఫెయిల్ అయ్యిందనుకుందాం.. హ్యాండ్ బ్రేక్ వేస్తే.. కారు అక్కడికక్కడే ఆగిపోతుంది కదా? ఏమైనా.. కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణాన్ని తీసింది. అది కూడా తనదేమాత్రం తప్పు లేని వ్యక్తిది కావటం మరో విషాదంగా చెప్పాలి.