Begin typing your search above and press return to search.

ఆ దేశ ప్రజలంతా బానిసలే.. అతడు అధ్యక్షుడవడం... ఆ ప్రజల శాపం

By:  Tupaki Desk   |   14 Sept 2020 9:15 AM IST
ఆ దేశ ప్రజలంతా బానిసలే.. అతడు అధ్యక్షుడవడం... ఆ ప్రజల శాపం
X
అతడిని తిట్టడానికి నీచుడు, క్రూరుడు, రాక్షసుడు అనే పదాలు సరిపోవు. కొత్తగా ఏమైనా సృష్టించాలేమో. అడాల్ఫ్ హిట్లర్ వంటివారని మనం ఓ నియంత అని పిలుస్తుంటాం. బతికి ఉన్న వారిలో నియంత ఎవరూ అంటే మాత్రం కచ్చితంగా అతడి పేరు చెప్పాల్సిందే. అతడెవరో కాదు. కిమ్ జంగ్ ఉన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు. ఇతడంత క్రూరుడు ప్రపంచంలోనే ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. అతడు అధికారం కోసం, అడ్డు వచ్చిన ఎవరినైనా చంపేస్తాడు. తనకు అడ్డుగా ఉన్న సొంత మేన మామనే ఆకలిగా ఉన్న 120 వీధి కుక్కలతో దాడి చేయించి చంపేశాడు. అతడి పట్ల విధేయత చూపనివారికి, చిన్న తప్పు చేసినా దారుణంగా చంపిస్తాడు. ట్రంప్ తో శిఖరాగ్ర సదస్సులో విఫలం అయ్యారని ఆరుగురు మంత్రులను కాల్చి చంపేశాడు. ఓ వ్యక్తికి కరోనా సోకగా అతడి వల్ల వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని అతడిని కూడా చంపించాడు. ఓ తల్లి సాహసం చేసి అగ్ని ప్రమాదం నుంచి తన పిల్లలను రక్షించుకోగా ఆమెను చంపివేశాడు. కారణం ఏంటో తెలుసా.. అగ్ని ప్రమాదంలో తన బిడ్డలను రక్షించుకున్నా.. తమ పూర్వీకుల ఫోటోలు కాలిపోతుంటే ఆమె కాపాడ లేదని ఆ శిక్ష వేశాడు. అంతటి క్రూరుడు కిమ్. ఉత్తర కొరియా ప్రజల బానిస బతుకులు చూస్తే అయ్యో ఈ ఆధునిక యుగంలో ఇంతటి దురావస్థనా అని అనిపించక మానదు. ఆ దేశ ప్రజలు కిమ్ వంశస్థులనే దేవుళ్లుగా పూజించాలి. వారి పెద్దల సమాధుల దగ్గర కూడా చెప్పులు ధరించి నడవకూడదు. పొరపాటున పోర్న్ చూస్తే చంపేస్తారు. బైబిల్ చదవకూడదు. బైబిల్ కనిపించినా చంపేస్తారు. దేశంలో ఎప్పుడూ ప్రభుత్వం తరఫున రేడియోలో ఆదేశాలు ఇస్తుంటారు. ఒకవేళ రేడియో ఆపితే మాత్రం కఠిన చర్యలు అనుభవించాల్సిందే. ప్రతి ఇంటి బయట కిమ్ అతడి వంశస్థుల ఫోటోలు పెట్టుకోవాలి. మగవాళ్లంతా కిమ్ హెయిర్ స్టైల్ లో ఉంటే అదే హెయిర్ స్టైల్ లో ఉండాలి. ఉత్తర కొరియాలో ఐదేళ్ల కొకసారి ఎన్నికలు జరుగుతాయి. ఒక్కరు మాత్రమే పోటీ చేయాలి. ఎవరికైనా అభ్యర్థి నచ్చక పొతే బహిరంగంగా వెల్లడించాలి. అలా వెల్లడిస్తే కిమ్ చంపేస్తాడన్న భయంతో ప్రజలు వేరే దారిలేక అతడినే ఎన్నుకుంటారు.

అనుమానమొస్తే అంతమే

కింగ్ జంగ్ ఉన్ పాతికేళ్లకే ఉత్తర కొరియా అధ్యక్షుడయ్యాడు. తన పదవికి అడ్డుగా ఉన్న వారిని చంపి మరీ పగ్గాలు అందుకున్నాడు. భవిష్యత్తులోనూ తన పదవికి ఎవరూ రాకుండా ఆ వంశానికి చెందిన ఎంతోమందిని అంతం చేశాడు. తన ఆదేశాలు పాటించకపోయినా, చిన్న తప్పు చేసినా కిమ్ క్షమించడు. నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు.

ప్రజల బానిస బతుకు

అక్కడి ప్రజలు ఇతర దేశాలతో పోలిస్తే వందేళ్ళ వెనకాల ఉన్నారు. వారికి నేటి ఆధునిక పోకడలు తెలియవు. ఇంటర్నెట్, సెల్ ఫోన్ల వాడకం గురించి తెలియదు. వారికి సౌకర్యాలు కిమ్ అనుమతించలేదు. ప్రభుత్వం నిర్వహించే మూడు టీవీ ఛానళ్లు మాత్రమే వస్తాయి. న్యూస్ మాత్రమే ప్రసారం చేస్తుంటారు.అవి మాత్రమే ప్రజలు చూడాలి. కనీసం ప్రజలకు తమ తమ ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతి ఉండదు. కిమ్ ని ఆయన వంశస్థులను దైవంగా భావించి పూజలు చేస్తుంటారు.

పేదరికాన్ని దాచేశాడు

ఆ దేశ ప్రజలంతా కటిక పేదరికంలో మగ్గుతున్నారు. వారిని చూస్తే ఏం దౌర్భాగ్యం చేసుకొని ఈ దేశంలో పుట్టారా.. అనిపిస్తుంది. అక్కడ వారానికి ఆరు రోజులే పని అని చెప్పినా.. ఏడో రోజు కూడా వదలరు. వాలంటీర్ పేరుతో ఉచితంగా పని చేయించుకుంటారు. ఇలా 365 రోజులూ వాళ్ళు పని చేయాల్సి ఉంటుంది. ఆ దేశానికి వచ్చే పర్యాటకులకు కఠిన నిబంధనలు అమలు చేస్తారు. ఉత్తర కొరియా వాసులతో మాట్లాడేందుకు అనుమతించారు. తమ మొబైల్ ఫోన్లు కూడా ఎయిర్ పోర్టులోనే ఉంచి దేశంలో పర్యటించాల్సి ఉంటుంది. పర్యాటకులు ఎక్కడికి వెళ్లినా అక్కడి గైడ్ వెంట వెళ్లాల్సిందే. అతడు పర్యాటకులు ఇతరులతో మాట్లాడకుండా, ఫోటోలు తీయకుండా చూస్తుంటాడు.

ప్రత్యేక ఇంటర్నెట్ వ్యవస్థ

అక్కడి ప్రజలకు ఇంటర్నెట్టు వ్యవస్థ లేదు. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా అక్కడ పుట్టిన వారికి తెలియదు. నిజం చెప్పాలంటే వారు మరో గ్రహంలో నివశిస్తున్నట్లు ఉంటుంది పరిస్థితి. వీఐపీలకు మాత్రం ప్రత్యేకంగా 'రెడ్ స్టార్ ' అనే ఇంటర్నెట్ వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. మనలాగా గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్ వారికి ఉండదు.

నేరం చేస్తే మూడు తరాలు జైల్లోనే

ఉత్తర కొరియా వారు నేరం చేయాలంటే వణికి పోతారు. ఎందుకంటే అక్కడి శిక్షలు అంత కఠినంగా ఉంటాయి.ఒక్కరు తప్పు చేసినా వారింట్లో మూడు తరాల వారు జైల్లో మగ్గాల్సిందే. ప్రస్తుతం అక్కడి జైళ్లలో 2.5 లక్షల మంది మగ్గుతున్నారు. దేశం నుంచి తప్పించుకుని మరో దేశానికి పారిపోవాలని చూస్తే తర్వాతి తరం వారిని కూడా బలి చేస్తారు..కాబట్టి ఆ పని చేయరు.

సెపరేట్ క్యాలెండరు

ప్రపంచంలో అన్ని దేశాలకు ఒక క్యాలెండరు ఉంటే ఉత్తర కొరియాలో మాత్రం సెపరేటు క్యాలెండరు ఉంది. మనకు ఇప్పుడు 2020 సంవత్సరం అయితే వారికి 107 సంవత్సరం. కిమ్ తాత కిమ్ సంగ్ పుట్టిన తేదీ నుంచి క్యాలెండరు ఇయర్స్ ప్రారంభం అయ్యాయి. అంతే కాదు. వాళ్లకు ప్రత్యేకంగా టైమ్ జోన్ ఉంది. జపాన్ కంటే 30 నిమిషాల ముందుకు సమయాన్ని మార్చుకున్నారు.

శారీరక అవసరాల కోసం 2000 మంది మహిళలు

కిమ్ తనకు తన సైన్యానికి శారీరక అవసరాలు తీర్చుకునేందుకు 2000 మంది మహిళలతో 'ప్లెజర్ స్క్వాడ్ ' ఏర్పాటు చేసుకున్నాడు. వీరిలో 13 ఏళ్ళ బాలికలే అధికం. ఈ బాలికలు సైన్యానికి శారీరక అవసరాలు తీర్చాలి. కిమ్ కోసం సెపరేట్ గా మరో మహిళా బృందం ఉంటుంది. అతడు కోరినపుడల్లా సెక్స్ లో కలవాలి. ఇలా లెక్కకు మించి నీచపు పనులు చేస్తున్న కిమ్ అనారోగ్యం బారిన పడి అజ్ఞాతానికి వెళ్లి పోయాడని వార్తలు వస్తుండటంతో అతడు ఎప్పుడెప్పుడు పోతాడా.. అని అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు.