Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ క్లాసులో టీచర్ కు షాకింగ్ అనుభవం.. క్వార్టర్ అంటే 30 ఎంఎల్?

By:  Tupaki Desk   |   12 Oct 2021 9:47 AM IST
ఆన్ లైన్ క్లాసులో టీచర్ కు షాకింగ్ అనుభవం.. క్వార్టర్ అంటే 30 ఎంఎల్?
X
కరోనా కారణంగా విద్యా విధానం సంపూర్ణంగా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలోఆన్ లైన్ క్లాసులు అంటే.. కొన్ని ప్రత్యేక రంగాలకు.. చాలాతక్కువగా మాత్రమే డిజైన్ చేసే వారు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఆన్ లైన్ క్లాసులు పెరిగిపోయాయి. ఆఫ్ లైన్ క్లాసులు పూర్తిగా తగ్గిపోయాయి. మొదట్లో కొత్తగా మొదలైన ఆన్ లైన్ క్లాసులు ఆసక్తికరమన్నట్లు అనిపించినా.. రోజులు గడిచే కొద్దీ సంప్రదాయ పద్ధతిలో ఆఫ్ లైన్ క్లాసులకు అటు విద్యార్థులు.. ఇటు టీచర్లు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ క్లాసుల సందర్భంగా చోటు చేసుకునే కొన్ని ప్రత్యేక పరిస్థితులకు సంబంధించిన వివరాలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. తాజాగా ఒక వైరల్ వీడియో చాలా బాగా పాపులర్ అయ్యింది. ఈ వీడియోకు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇంతకూ అంత పాపులర్ కావటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. క్వార్టర్ అంటే ఎంత? అన్న ఆన్ లైన్ మాస్టారికి స్టూడెంట్ ఇచ్చిన సమాధానం షాకింగ్ గా మారటమే కాదు.. సదరు టీచర్ ముఖంలో కనిపించిన ఎక్స్ ్షన్ ఇప్పుడు అందరిని తెగ ఆకర్షిస్తోంది.

సీఏ విద్యార్థులకు ఎడ్రోవేట్ వ్యవస్థాపక సభ్యుడు ధవల్ పురోహిత్ స్టూడెంట్లకు పాఠాలు చెబుతున్నాడు. ఈ సందర్భంగా ఒక క్వార్టర్ అంటే ఎంత? అన్న ప్రశ్నను సంధించారు ఆయన. దానికి స్పందించిన ఒక విద్యార్థి వెంటనే.. 30 ఎంఎల్ అంటే జవాబు ఇచ్చారు. దీన్ని చూసినంతనే మాష్టారికి మైండ్ బ్లాక్ అయ్యింది. నొసలు చిట్లిస్తూ.. ఒక లాంటి ప్రత్యేక ఎక్స్ ప్రెషన్ తో క్వార్టర్ అంటే మూడు నెలలు అని అర్థమని బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖంలోని భావాలు అందరిని తెగ ఆకర్షిస్తున్నాయి. ఉన్నత విద్యా కోర్సు అయిన సీఏ క్లాసులోని విద్యార్థి.. క్వార్టర్ అంటే ఇలాంటి సమాధానం ఇవ్వటమా? అని విస్తుపోతున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో పలువురిని ఆకర్షిస్తోంది.