Begin typing your search above and press return to search.

షాకింగ్ : 70 ల‌క్ష‌ల మంది భార‌తీయుల క్రెడిట్‌, డెబిట్ కార్డ్స్ డేటా లీక్‌ !

By:  Tupaki Desk   |   9 Dec 2020 7:00 PM IST
షాకింగ్ : 70 ల‌క్ష‌ల మంది భార‌తీయుల క్రెడిట్‌, డెబిట్ కార్డ్స్ డేటా లీక్‌ !
X
దేశంలో ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగ‌దారుల‌కు షాకింగ్ న్యూస్‌. మొత్తం 70 ల‌క్ష‌ల మందికి చెందిన కార్డుల వివ‌రాల‌తోపాటు వారి ఫోన్ నంబ‌ర్లు, ఈ-మెయిల్ ఐడీలు త‌దిత‌ర స‌మాచారం అంతా డార్క్ వెబ్‌ లో అందుబాటులో ఉంద‌ని ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ రీసెర్చ‌ర్లు వెల్ల‌డించింది. వారి పేర్లు, వారు ఉద్యోగం చేసే కంపెనీల వివ‌రాలు, వార్షిక ఆదాయం వంటి వివ‌రాలు కూడా లీక్ అయ్యాయ‌ని నిర్దారించారు. ఆన్‌ లైన్‌ లో 20 జిబి చాలా కాన్ఫిడెన్షియల్ డేటా హ్యాక్ చేయబడింది, బహిర్గతమైన ఇతర వివరాలలో వినియోగదారుల పేర్లు, యజమాని సంస్థలు మరియు వార్షిక ఆదాయం కూడా ఉన్నాయి అని భద్రతా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

డేటా 2010 మరియు 2019 మధ్య కాలానికి సంబంధించినదని , ఇది స్కామ్స్ చేసే వారికి , హ్యాకర్లకు చాలా విలువైన సమాచారం అని భద్రతా పరిశోధకులు ఒక ప్రకటనలో ఐఏ ఎన్ ఎస్ కు చెప్పారు. డేటాను బ్యాంకుల‌కు సేవ‌లు అందించే థ‌ర్డ్ పార్టీ కంపెనీల‌కు చెందిన వారే లీక్ చేసి ఉంటార‌ని నిపుణులు తెలిపారు. ప్ర‌స్తుతం మార్కెట్ ‌లో ప్ర‌జ‌ల‌కు చెందిన సాధార‌ణ స‌మాచారం క‌న్నా వారి బ్యాంకింగ్ స‌మాచారానికే ఎక్కువ డిమాండ్ ఉంద‌న్నారు. అందువ‌ల్లే ఎవ‌రైనా ఆ డేటాను హ్యాక‌ర్ల‌కు, స్కామర్ల‌కు అమ్మి ఉంటార‌ని భావిస్తున్నారు.

అయితే డేటా లీక్ అయిన నేప‌థ్యంలో కార్డుల వినియోగదారులు వెంట‌నే త‌మ కార్డుల పిన్ నంబ‌ర్ ‌లు, అకౌంట్ల పాస్‌ వ‌ర్డ్‌ ల‌ను మార్చుకుంటే మంచిద‌ని సూచిస్తున్నారు. ఇక స‌ద‌రు 70 లక్ష‌ల మందికి చెందిన పాన్ కార్డుల స‌మాచారం కూడా లీకైన‌ట్లు నిర్దారించారు.కరోనా మహమ్మారి మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు సైబర్‌ సెక్యూరిటీ సంఘటనలు నిరంతర సమస్యగా ఉన్న సమయంలో ఈ విషయం వెల్లడి కావటం ఆందోళన కలిగిస్తుంది. ఈ డేటా లీక్ కారణంగా బ్యాంక్ ఎకౌంట్స్ , డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు