Begin typing your search above and press return to search.

30 ఏళ్ల లోపు వారికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా వేయొద్దట.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   8 April 2021 8:30 AM GMT
30 ఏళ్ల లోపు వారికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా వేయొద్దట.. ఎందుకంటే?
X
వ్యాక్సిన్ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. అయితే.. ప్రాక్టికల్ గా వాడటం షురూ చేసిన తర్వాత మాత్రం ఈ వ్యాక్సిన్ ను 30 ఏళ్ల లోపు వారికి ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని చెబుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని బ్రిటన్ ప్రభుత్వానికి వ్యాక్సినేషన్‌ అండ్‌ ఇమ్యూనైజేషన్‌ సంయుక్త కమిటీ కీలక సిఫార్సు చేసింది.

30 ఏళ్ల లోపు వయసు ఉండి.. ఆరోగ్య సమస్యలున్న వారికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఇవ్వకపోవటమే మంచిదని చెబుతున్నారు. ఈ టీకాను తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టటం.. ప్లెట్ లెట్లు తగ్గిపోవటం లాంటి అరుదైన పరిస్థితులు తలెత్తటంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఆరోగ్యవంతులైన ఈ వయస్కుల వారికి ప్రత్యామ్రాయ వ్యాక్సిన్ అయిన ఫైజర్.. మోడెర్నా లాంటివి అందించొచ్చని పేర్కొన్నారు.

అయితే.. ఇప్పటికే మొదటి డోసు తీసుకున్న వారికి.. రెండో డోసు ఇవ్వొచ్చని కమిటీ పేర్కొంది. బ్రిటన్ లో 18 నుంచి 30 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదు. ఒకవేళ.. షురూ చేసినా ఆక్స్‌ఫర్డ్‌ టీకా కాకుండా మరేదైనా టీకా ఇవ్వటానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పటం గమనార్హం.