Begin typing your search above and press return to search.
కరోనా నుంచి కోలుకున్నాక శరీరంలో షాకింగ్ మార్పు
By: Tupaki Desk | 9 Dec 2020 10:15 AM ISTకరోనాకు సంబంధించి అంతకంతకూ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కరోనా బారిన పడి.. కోలుకున్న తర్వాత హమ్మయ్య అని ఊపిరిపీల్చుకోవటానికి.. కోవిడ్ ను జయించామని సంతోషించటానికి ఏమీ లేదు. ఎందుకంటే.. కరోనా తర్వాత చోటు చేసుకునే మార్పులు.. ఎదురయ్యే సమస్యల మీద ఇప్పటికే చాలా అంశాలు వెలుగుచూశాయి. తాజాగా జరిపిన అధ్యయనంలో మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. మహమ్మారి బారిన పడి కోలుకున్న తర్వాత శరీరంలోని యాంటీబాడీలు త్వరగా మాయమైపోతున్న విషయాన్ని గుర్తించారు.
కోవిడ్ బారిన పడి కోలుకున్న 250 మంది రోగులపై ఐదు నెలల పాటు వివిధ పరీక్షలు జరపటమే కాదు.. వారిపై పలు అధ్యయనాలు నిర్వహించారు శాస్త్రవేత్తలు. ఈ సందర్భంగా వారిలో చోటు చేసుకునే మార్పులను విశ్లేషించారు. దీనికి సంబంధించిన వివరాల్ని సైన్స్ ఇమ్యునాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు.
ఈ వివరాల ప్రకారం చూస్తే.. కరోనా వచ్చి తగ్గిన తర్వాత వారిలోని యాంటీబాడీలు త్వరగామాయమైపోతున్నట్లుగా గుర్తించారు. వైరస్ సోకినప్పటికీ అలాంటి లక్షణాలు కనిపించని వారి నుంచి కూడా 983 బ్లడ్ ప్లాస్మా నమూనాల్ని సేకరించి.. వారి నమూనాల్ని విశ్లేషించారు. వీరితోపాటు..కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న 79 మందితోపాటు.. మరో 175 మంది ఔట్ పేషెంట్ల నమూనాల్ని విశ్లేషించారు.
వీరందరిపై వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్తించిన కొత్త అంశం ఏమంటే.. కరోనా బారిన తీవ్రంగా పడి కోలుకున్న తర్వాత రోగనిరోధక శక్తి ప్రతిస్పందనలు బాగానే ఉంటాయి. కానీ.. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా క్షీణిస్తాయన్న విషయాన్ని గుర్తించారు.దీనికి కారణం..యాంటీబాడీలు మాయం కావటమే కారణంగా చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత నుంచి యాంటీబాడీలు క్షీణించటం మొదలవుతుందని తేల్చారు. తీవ్రమైన అనారోగ్యం బారిన వారితో పోలిస్తే.. తేలికపాటి అనారోగ్యంతో బాధ పడే వారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సో.. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత హీనపక్షం ఆర్నెల్ల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పక తప్పదు.