Begin typing your search above and press return to search.

వైఎస్ షర్మిలకు షాకిచ్చిన ‘గట్టు’

By:  Tupaki Desk   |   29 Jun 2021 10:00 PM IST
వైఎస్ షర్మిలకు షాకిచ్చిన ‘గట్టు’
X
ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా షర్మిల పార్టీ పెట్టకముందే నేతలు ఆమె వైఖరి నచ్చక పార్టీ మారుతున్నారంటే ఇక పార్టీ పెడితే ఏంటి సంగతి అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటిదాకా కనీసం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ఆమె పార్టీలోకి రాలేదు. ఇప్పుడు ఉన్న వారు కూడా వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది.

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల.. రాజన్న రాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆదిలోనే ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.

ఇప్పటివరకు తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి ఏప్రిల్ 3వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు.తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పంపారు.

ఇదే గట్టు శ్రీకాంత్ రెడ్డి వైఎస్ షర్మిల పార్టీలో కీలకంగా పనిచేస్తారని అనుకుంటున్న సమయంలో ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం నిజంగానే షర్మిలకు షాకిచ్చినట్టైంది.

గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జులై 1వ తేదీన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతోపాటు హుజూర్ నగర్ కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కూడా బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.