Begin typing your search above and press return to search.

ఏపీలో ఇద్దరు డిప్యూటి సీఎంలకు షాక్.. కొత్త సంకేతాలిస్తున్న జగన్?

By:  Tupaki Desk   |   31 Oct 2021 12:55 PM IST
ఏపీలో ఇద్దరు డిప్యూటి సీఎంలకు షాక్.. కొత్త సంకేతాలిస్తున్న జగన్?
X
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. ముందుగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి శాఖల్లో కోత విధించింది ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన నిర్వహించిన శాఖలల్లో వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అప్పగించింది. ఎక్సైజ్ శాఖకే నారాయణస్వామిని పరిమితం చేశారు. గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటి ప్రతిపాదలను ఇప్పుడు అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించి సీఎస్ సమీర్ గెజిట్ విడుదల చేశారు. త్వరలోనే మరో ఉప ముఖ్యమంత్రి ధర్మాన ప్రసాదరావు కృష్ణదాసు నుంచి స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌ల శాఖను కూడా తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకు వచ్చింది.

ఆదాయ పరంగా కీలక శాఖలను ఆర్దిక శాఖ పరిధిలోకి తీసుకు రావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టిక శాఖ, శాసనసభా వ్యవహారాలను కూడా బుగ్గన పర్యవేక్షిస్తున్నారు. అదనపు బాధ్యతల వల్ల ఆర్థిక మంత్రిపై పని బారం, ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో తర్వలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో పని ఒత్తిడిని తగ్గించేందుకు శాసనసభా వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత ఆర్దిక శాఖ మంత్రికి కాకుండా న్యాయ శాఖతో కలిపే అవకాశాలున్నాయనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తన మంత్రివర్గంలో రెండున్నరేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో మార్పులుంటాయని తెలిపిన విషయం తెలిసిందే. జగన్ నిర్ణయం ప్రకారం డిసెంబర్ 8 నాటికి ప్రస్తుత మంత్రులు బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మంత్రి కూర్పుపై కసరత్తు ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మంత్రివర్గంలో వంద శాతం కొత్తవారినే తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పినట్లు బాలినేని పేర్కొన్నారు.

ఐదారు నెలలుగా మంత్రి వర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆశావాహులు సీఎం దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆశావాహులు ఎప్పుడు మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే.. సిట్టింగ్ మంత్రులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి శాఖల్లో కొత విధించారని, త్వరలో మరో ఉప ముఖ్యమంత్రి శాఖలను కుదిస్తారని... మంత్రివర్గ విస్తరణలో భాగంగానే ఈ సంకేతాలిస్తున్నారని చెబుతున్నారు.