Begin typing your search above and press return to search.

అమెరికా భారీగా పెంచిన పౌరసత్వ ఫీజులకు కోర్టు బ్రేక్

By:  Tupaki Desk   |   1 Oct 2020 6:05 PM IST
అమెరికా భారీగా పెంచిన పౌరసత్వ ఫీజులకు కోర్టు బ్రేక్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందుర అమెరికన్లను ఆకట్టుకునేందుకు వలసవాదులపై ప్రతాపం చూపుతున్నారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే భారీగా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ ఫీజులను పెంచారు. అక్టోబర్ 2 నుంచి ఇవి అమెరికాలో అమలులోకి రావాల్సింది.

ఈ క్రమంలోనే 8 స్వచ్ఛంద సంస్థలు, ఇమ్మిగ్రెంట్ లీగల్ రిసోర్స్ సెంటర్ లు ఉమ్మడిగా ఈ పెంచిన ఫీజులను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లగా భారీగా పెంచిన పౌరసత్వ , ఇమ్మిగ్రేషన్ ఫీజులను నిలిపివేస్తూ అమెరికా ఫెడరల్ జడ్జి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వీటిని తక్షణం నిలిపివేశారు. ఇద్దరు సీనియర్ హోంసెక్యూరిటీ డిపార్ట్ మెంట్ అధికారులను చట్టవిరుద్ధంగా నియమించారని జడ్జి మండిపడ్డారు.

ఫెడరల్ నియమం ప్రకారం ఈ ఫీజులను ఎందుకు పెంచారో వివరించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే ఫీజుల పెంపును అడ్డుకున్నానని జడ్జి తెలిపారు.

తాజాగా గ్రీన్ కార్డులకు, పౌరసత్వ హక్కులకు తాత్కాలిక వర్క్ పర్మిట్ లకు ఫీజులను 20శాతం మేర పెంచారు. హెచ్1 బి వీసా ఫీజు ప్రస్తుతం 460 డాలర్ల నుంచి 555 డాలర్లకు పెంచారు. పౌరసత్వ ఫీజుని 83శాతం పెంచి.. 640 డాలర్ల నుంచి 1170 డాలర్లుగా నిర్ణయించారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా ఊరట లభించింది.