Begin typing your search above and press return to search.

తోట త్రిమూర్తులు షాక్ .. రీకాల్ చేయాలంటూ దళిత సంఘాల ధర్నా !

By:  Tupaki Desk   |   28 Jun 2021 11:30 AM GMT
తోట త్రిమూర్తులు షాక్ .. రీకాల్ చేయాలంటూ దళిత సంఘాల ధర్నా !
X
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తులకు సొంత జిల్లాలోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులఎమ్మెల్సీగా రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద దళిత, ప్రజా సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టరేట్‌ కు ప్రదర్శనగా చేరుకుని నిరసన తెలిపారు. వెంకటాయపాలెంలో జరిగిన శిరోముండనం కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నమ్మి గెలిపించిన దళితులకు సీఎం జగన్‌ అన్యాయం చేస్తున్నారని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. మెజారిటీ ఉందని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులను రీకాల్ చేయాలని కోరుతూ కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఇక తాజాగా ఈ రోజు మామిడికుదురు లో 216 జాతీయ రహదారిపై అంబెడ్కర్ యువజన సంక్షేమ సంఘం , మాలమహానాడు ఆధ్వర్యంలో దళిత నాయకులు ఆందోళన చేశారు. ఈ మేరకు రోడ్డు పై గుండు గగీయించుకొని , మేడలో ముంత , మొలకి తాటాకు కట్టుకొని నిరసన తెలిపారు.