Begin typing your search above and press return to search.
లాలూ ప్రసాద్ యాదవ్ కు మరోసారి షాక్
By: Tupaki Desk | 19 Feb 2021 10:30 PM ISTగడ్డి కుంభకోణంలో ఇరుక్కొని జైలు పాలైన బీజేపీ మాజీ సీఎం, ఆర్డేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. రెండు నెలల తర్వాత ఈ కేసులో మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
లాలూ ప్రసాద్ యాదవ్ మరో రెండు నెలలు వేచిచూడటం తప్ప చేసేదేం లేదు. రూ. 900 కోట్ల గడ్డి కుంభకోణంకు సంబంధించిన మూడు కేసుల్లో ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్‌కుబెయిల్ వచ్చింది. అయితే, డుమ్కా ట్రెజరీ కేసులో కూడా బెయిల్ వస్తే జైలు నుంచి విడుదల అవుతానని లాలూ ఆశించారు, కానీ కోర్టులో షాక్ తగిలింది. దీంతో లాలూతోపాటు ఆర్జేడీ నేతలు నిరాశకు గురయ్యారు.
తాను ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడిపారంటూ జనవరి 25న లాలూ న్యాయవాది కోర్టుకు తెలిపారు. డుమ్కా ట్రెజరీ వ్యవహారంలో తొందరగా విచారించాలని కోరారు. జనవరి 29న విన్నపాన్ని కోర్టు స్వీకరించింది. లాలూ పలు ఆరోగ్య సమస్యలతో తరచూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బెయిల్ పిటీషన్ కూడా రద్దు కావడంతో లూలూకు షాక్ తగిలింది.