Begin typing your search above and press return to search.

చైనా కుబేరుడికి షాక్

By:  Tupaki Desk   |   3 Feb 2021 5:00 AM IST
చైనా కుబేరుడికి షాక్
X
చైనా ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు ‘జాక్ మా’కు తాజాగా భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన సంపదను చైనా సర్కార్ నీరుగార్చింది. కొద్దిరోజులు అజ్ఞాతంలోకి కూడా ఆయన వెళ్లిపోయాడు.ఈ క్రమంలోనే చైనా దేశ అధికారిక రాష్ట్ర మీడియా ప్రచురించిన టాప్ బిజినెస్ లీడర్స్ జాబితా నుంచి అలీబాబాను తప్పించడం సంచలనమైంది.

దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన ప్రముఖ వ్యాపారవేత్తలను ప్రశంసించిన షాంఘై సెక్యూరిటీస్ పత్రిక ప్రముఖ టెక్ దిగ్గజం అలీబాబాను విస్మరించడం సంచలనమైంది.చైనా ప్రభుత్వ మీడియా సంస్థ షింజువా ఏజెన్సీ తాజాగా అలీబాబాను, దాని ఓనర్ జాక్ మా ను ప్రస్తావించకపోవడం గమనార్హం. జాక్ మా ప్రత్యర్థి టెన్సెంట్ సీఈవో పోనీమాపై ప్రశంసలు కురిపించడం విశేషం.

గతేడాది అక్టోబర్ లో చైనా ప్రభుత్వంపై జాక్ మా కొన్ని సంచలన విమర్శలు చేశాడు. దీంతో సీరియస్ అయిన చైనా ప్రభుత్వం జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,77,000 కోట్లు) ఐపీవోను నిలిపివేసి షాక్ ఇచ్చింది. చైనాప్రభుత్వం యాంట్‌ గ్రూపుతోపాటు అలీబాబాపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ప్రారంభించింది. ఆ తరువాత నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న జాక్ మా, గతనెల జనవరిలో దర్శనమిచ్చాడు. చైనా ఆయనను ఏదో చేసిందన్న విమర్శలు వచ్చాయి.

2019 లో అలీబాబా చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన అలీబాబా డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. అలీబాబా తన త్రైమాసిక ఆదాయాలను ఈ రోజు ప్రకటించనుంది. తాజా పరిణామంపై అలీబాబా ఇంకా స్పందించలేదు.