Begin typing your search above and press return to search.

అమ్మాయిలకు షాక్​.. షార్టులు, బికినీలు వేసుకుంటే ఫైన్​

By:  Tupaki Desk   |   19 Sept 2020 6:00 AM IST
అమ్మాయిలకు షాక్​..  షార్టులు, బికినీలు వేసుకుంటే ఫైన్​
X
కంబోడియా దేశం ఓ కొత్త చట్టం అమ్మల్లోకి తీసుకురాబోతోంది. ఈ చట్టం ప్రకారం ఆ దేశంలోని మహిళలు, యువతులు శరీరం కనిపించేలా షార్టులు, బికినీలు, టూపీస్​లు ధరించడం చట్టవిరుద్ధం. పురుషులు కూడా తమ శరీరం కనిపించేలా దుస్తులు వేసుకోకూడదు. మహిళలు కానీ, పురుషులు కానీ నిబంధనలకు దుస్తులు ధరిస్తే పోలీసులు వెంటనే ఫైన్​ వేస్తారు. కాగా ఈ కొత్త చట్టం ఆ దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళా సంఘాలు, ఫెమినిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సౌకర్యం గా ఉండే దుస్తులు ధరించే స్వేచ్చ కూడా మహిళల కు లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. యువతులు అయితే రోడ్లమీదకు వచ్చి బహిరంగగానే తమ నిరసనను తెలుపుతున్నారట. కొత్త చట్టం మహిళల తో పాటు పురుషులకు కూడా షాక్​ ఇచ్చింది. ఇక పై పురుషులు తమ చాతి, కండలు కనిపించేలా బట్టలు ధరించినా ఫైన్​ వేస్తారు.

కొత్త చట్టంపై సోషల్​ మీడియా లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని యువత ప్రశ్నిస్తున్నారు. కొందరు యువతులు స్కర్టులు, బికినీలు ధరించిన ఫోటోలను సోషల్​మీడియాలో పోస్ట్​ చేస్తూ ప్రభుత్వ తీరు పట్ల తమ నిరసనను తెలుపుతున్నారు. యువతుల నిరసనకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా సాంప్రదాయవాదులు మాత్రం ప్రభుత్వ నిర్ణయమే తీసుకుందంటూ తమ మద్దతు తెలుపుతున్నారు.