Begin typing your search above and press return to search.

సాగర్ లో బీజేపీకి షాక్ టీఆర్ ఎస్‌ లోకి ఆ సీనియర్ నేత?

By:  Tupaki Desk   |   30 March 2021 12:40 PM GMT
సాగర్ లో బీజేపీకి షాక్ టీఆర్ ఎస్‌ లోకి ఆ సీనియర్ నేత?
X
తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి నిరాశకు గురైన కడారి అంజయ్య యాదవ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ ఎస్ ‌లోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో కడారి బీజేపీ టికెట్ ఆశించగా , చివరి నిమిషంలో అనూహ్యంగా ఆ టికెట్ రవి నాయక్‌ కు బీజేపీ కేటాయించింది. దీనితో అంజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారట. టీఆర్ ఎస్‌ లో చేరికపై అంజయ్యతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపారు. వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్ ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారట .

టీఆర్ ఎస్ ‌లో చేరికపై అంజయ్యతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపారు. వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్ ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రసారమాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. టీఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధమైన అంజయ్య యాదవ్ ‌ను పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకుళ్తున్నారు. మొదట ప్రగతి భవన్‌ కు వెళ్లిన వీరు అక్కడ సీఎం కేసీఆర్ లేరనే విషయం తెలుసుకుని ఫామ్ హౌస్ ‌కు బయలు దేరారు. ఫామ్ హౌస్ ‌లో కేసీఆర్ సమక్షంలో అంజయ్య యాదవ్ టీఆర్ఎస్‌లో చేరనున్నారట.

సాగర్ నుండి పోటీ చేసే అభ్యర్థిని టీఆర్ ఎస్ ప్రకటిస్తే ఆ తర్వాత అసంతృప్త నేతలను లాక్కుని వారిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని బీజేపీ మొదటగా భావించింది. కానీ, టిఆర్ ఎస్ నేతలు దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడికి టికెట్ ఫైనల్ చేయడంతో ఎవరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అయితే అనూహ్యంగా బీజేపీ రవి నాయక్‌ కు టికెట్ కేటాయించడంతో అంజయ్య యాదవ్ తనకు టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో అంజయ్య టి ఆర్ ఎస్ లో చేరడానికి సిద్ధమైయ్యారని సమాచారం.