Begin typing your search above and press return to search.
అఖిలప్రియ బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా
By: Tupaki Desk | 17 Jan 2021 11:49 AM ISTసీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన మాజీ మంత్రి అఖిలప్రియకు మరోసారి చుక్కెదురైంది. సికింద్రాబాద్ కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా బెయిల్ లభిస్తుందని ఆమె తరుఫు న్యాయవాదులు భావించినా.. బెయిల్ దొరకలేదు.
అఖిలప్రియ బెయిల్ పిటీషన్ విచారణ సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అఖిలకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరుఫు న్యాయవాది వాదించారు. అఖిలప్రియ ఆరోగ్య రిపోర్టును కూడా కోర్టుకు సమర్పించారు.
బెయిల్ పిటీషన్ పై పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది వరకే ఒకసారి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ ను కోర్టు వాయిదా వేసింది. మూడు రోజులు కస్టడీకి అఖిలప్రియను అప్పగించింది. ఆ కస్టడీ ముగియడంతో కోర్టును మరోసారి అఖిలప్రియ ఆశ్రయించింది. సోమవారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది.
ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఏ2గా ఉన్నారు.