Begin typing your search above and press return to search.
కొత్త జంటకు అనుకోని అతిథి ఆశీర్వాదం..అంతా షాక్
By: Tupaki Desk | 12 Sept 2020 3:40 PM ISTకరోనా వ్యాప్తి మొదలవగానే ఎన్నో పెళ్ళిళ్ళు వాయిదా పడ్డాయి. ముందు ఏ నెలో రెండు నెలలో ఉంటుందనుకున్న కరోనా పది నెలలు గడిచినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఇక తప్పదన్నట్లుగా తూతూమంత్రంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లకు వెళ్తే ఎక్కడ కరోనా అంటుకుం దోనని చాలా మంది భయపడుతున్నారు. దీంతో జనం లేక పెళ్లిల్లలో ఒకప్పటి కళ తగ్గిపోయింది. అసలు పెళ్లి సందడే కనిపించడం లేదు. అబ్బాయి తరఫున పది మంది అమ్మాయి తరఫున పది మంది వచ్చి పెళ్ళి తంతు ముగించి వెళ్ళి పోతున్నారు. తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంట కు వానరం షాకిచ్చింది. ఓ జంట పెళ్లి వేడుకల్లో తలంబ్రాలు పోసుకుంటుండగా ఓ వానరం అక్కడికి వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళింది. దీంతో పెళ్లి కి వచ్చిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో జరిగింది.
నూగూరు వెంకటాపురం కు చెందినవారు మంగం పేట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో పెళ్లి వేడుకలు జరుపుతుండగా ఓ వానరం అక్కడికి వచ్చింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తలంబ్రాలు పోసుకుంటున్న సమయంలో ఆ వానరం ఒక్క ఉదుటున వచ్చి పెళ్ళికొడుకు తల పై కూర్చుంది. దీంతో పెళ్లి కొడుకు తో సహా అక్కడున్న వారంతా దాడి చేస్తుందేమోనని భయపడ్డారు. కానీ ఆ వానరం ప్లేటులోని తలంబ్రాలను తీసుకుని కొత్త జంట పై చల్లి ఆశీర్వాదం ఇచ్చింది. దీంతో వధూవరుల తోపాటు పెళ్ళికి వచ్చినవాళ్ళు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. వానరం నిండు ఆశీర్వాదంపై ఆనందం వ్యక్తం చేశారు.