Begin typing your search above and press return to search.

ప్లీజ్ వెంటిలేటర్లు ఇవ్వండి..భారత్ సాయం కోరిన అక్తర్!

By:  Tupaki Desk   |   9 April 2020 12:30 PM GMT
ప్లీజ్ వెంటిలేటర్లు ఇవ్వండి..భారత్ సాయం కోరిన అక్తర్!
X
ప్రస్తుతం కరోనా మహమ్మారి తో ప్రపంచంలోని అన్ని దేశాలు విపత్కర పరిస్థితులని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ - రావల్పిండి ఎక్స్‌ ప్రెస్‌ గా సుపరిచితమైన షోయబ్‌ అక్తర్‌ కరోనా పాక్ లో విజృంభిస్తున్న సమయంలో భారత్ సాయాన్ని కోరారు. ప్రస్తుతం పాకిస్తాన్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని - కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కూడా లేవన్నాడు. ఈ విషయంలో తమను భారత్‌ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

మాకు ప్రస్తుతం 10వేలకు పైగా వెంటిలేటర్లు అవసరం. వెంటిలేటర్లు లేక మా దేశం మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ ఆపత్కాలంలో ఓ 10 వేల వెంటిలేటర్లు సాయం చేస్తే.. ఎప్పటికీ భారత్ సాయాన్ని పాక్ గుర్తించుకుంటుందని అక్తర్ చెప్పుకొచ్చాడు.ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మానవతా కోణంలో మాకు సాయం చేయండి అని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలకి చేరువకాగా.. గురువారం మధ్యాహ్నానికి భారత్‌ లో 6,217 - పాకిస్థాన్‌ లో 4,332 కేసులు నమోదయ్యాయి. పాక్ లో ఇప్పటివరకు కరోనా కారణంగా 60 మంది మరణించారు. దీంతో ఇరు దేశాలు లాక్‌ డౌన్ ప్రకటించి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

అదే సమయంలో భారత్‌-పాకిస్తాన్‌ ల మధ్య వన్డే సిరీస్‌ జరపాలనే ప్రతిపాదనను కూడా అక్తర్‌ తీసుకొచ్చాడు. ప్రస్తుతం భారత్‌ తో పాటు పాకిస్తాన్‌ లోనూ కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని - దాంతో ఇరు దేశాలు మూడు వన్డేల సిరీస్‌ నిర్వహించాలని... సిరీస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇరు దేశాలు సమానంగా పంచుకుందామని చెప్పుకొచ్చాడు. 2007 తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఎటువంటి ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్ జరుగలేదు. ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో - ఆసియా కప్‌ లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి. అయితే , అక్తర్ ప్రతిపాదన పై స్పందించిన టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ..మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బు ఇండియా కి అవసరం లేదు అని - కరోనా ను ఎదుర్కోవడానికి ఇండియా సిద్ధంగా ఉందని - దానికోసం మ్యాచ్ ఆడి క్రీడాకారుల ప్రాణాలని పనంగా పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు.