Begin typing your search above and press return to search.

రాహుల్.. అలా పిలుస్తావా.? సీఎం ఫైర్

By:  Tupaki Desk   |   1 Nov 2018 2:30 PM GMT
రాహుల్.. అలా పిలుస్తావా.? సీఎం ఫైర్
X
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది. ఇద్దరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుకున్న విషయాన్ని లాగి మధ్య ప్రదేశ్ సీఎం, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ నిప్పులు చెరిగారు. అసలు రాహుల్ గాంధీకి పెద్దలను గౌరవించే సంస్కారం లేదంటూ ఆడిపోసుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ ఓ చోట ఐస్ క్రీం కోసం ఆగారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్, జ్యోతిరాధిత్య సింధియా ఉన్నారు. రాహుల్ ఐస్ క్రీమ్ తినబోతుండగా.. ఓ పిల్లాడు చూడడాన్ని గమనించి తన ఐస్ క్రీం పిల్లాడికి ఇచ్చేశాడు. తర్వాత కమల్ నాథ్ వైపు తిరిగి.. ‘కమల్ .. ఐస్ క్రీం బాగుంది.. నువ్వు కూడా తిను’ అంటూ ఏకవచనంతో సంభోధించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించాడు.

రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన కమల్ నాథ్ ను చిన్నా పెద్దా తేడా లేకుండా ఇలా పేరు పెట్టి పిలుస్తావా అంటూ రాహుల్ పై శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. 70 ఏళ్ల ఓ వ్యక్తిని ఇలా పేరు పెట్టి పిలుస్తావా.? ఇదే నా నీ భారతీయ సంస్కృతి అని చౌహాన్ ప్రశ్నించారు.