Begin typing your search above and press return to search.

మోడీని మ‌ళ్లీ గిల్లిన మిత్ర‌ప‌క్షం

By:  Tupaki Desk   |   11 March 2016 5:53 PM GMT
మోడీని మ‌ళ్లీ గిల్లిన మిత్ర‌ప‌క్షం
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గ‌ద్దెనెక్కిన త‌ర్వాత ఆయ‌నపై ప్ర‌తిప‌క్షాలు ఎంత విమ‌ర్శ‌లు గుప్తిస్తున్నాయో అంత‌కంటే ఎక్కువ‌గా ఆయ‌న‌పై మిత్ర‌ప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అదికూడా అంశాల వారీగా ఎత్తిచూప‌డం కాకుండా ఇబ్బందిక‌ర‌మైన స‌మయంలోనే మోడీ ఓపిక‌ను ప‌రీక్షించేలా నిల‌దీస్తున్నాయి. ఈ గిలిగింత‌ల ప‌ర్వంలో ముందుండే శివ‌సేన మ‌రోమారు మోడీని ఇర‌కాటంలో ప‌డేసింది.

లిక్క‌ర్‌ కింగ్ విజ‌య్‌ మాల్యా వేల కోట్ల రూపాయల రుణ ఎగవేతపై ఒక‌వైపు దర్యాప్తు జరుగుతుండగా మ‌రోవైపు ఆయ‌న దేశం విడిచి పారిపోవడంపై శివసేన కేంద్రాన్ని నిలదీసింది. ఐపీఎల్ మాజీ చైర్మన్ ల‌లిత్‌ మోడీ దేశం వదిలి వెళ్లిపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వారు ఇప్పుడు సమాధానం చెప్పాలని ప‌రోక్షంగా మోడీని నిల‌దీసింది. ఈ మేర‌కు శివసేన అధికార పత్రిక సామ్నా ఈ రోజు సంపాదకీయంలో డిమాండ్ చేసింది. పేద రైతులు తమ నివాసాలను తాకట్టు పెట్టి తీసుకున్న పాతిక వేల నుంచి 50 వేల రూపాయల చిన్న మెత్తం రుణాలను చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడేలా వేధింపులకు గురి అవుతున్నారనీ, కానీ మోడీ, మాల్యా వంటి వారి విషయంలో మాత్రం చట్టాలు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని సామ్నా విమర్శించింది. మాల్యా దేశం విడిచి పారిపోతాడని చిన్న పిల్లాడు సైతం ఊహించాడనీ, కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం మాత్రం కనిపెట్లలేకపోయిందని సామ్నా ఎద్దేవా చేసింది.