Begin typing your search above and press return to search.

బిట్రన్ - అమెరికాలో కూడా బీజేపీ గెలుస్తుంది

By:  Tupaki Desk   |   11 Feb 2019 4:08 PM IST
బిట్రన్ - అమెరికాలో కూడా బీజేపీ గెలుస్తుంది
X
బీజేపీకున్న ప్రధాన మిత్రపక్షం శివసేన కమలదళానికి షాకిచ్చింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఈసారి అత్యధిక సీట్లు తమవేనని ధీమా బీజేపీపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. కొద్దిరోజులుగా బీజేపీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న శివసేన తాజాగా కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోసింది. దేశంలో రైతు సమస్యలు, రాఫెల్ వివాదం, ఈవీఎం లోపాలు సహా ఇటీవల బీజేపీ నేతలు చేస్తున్న బాధ్యతారహిత ప్రకటనలపై శివసేన విరుచుకుపడింది..

మహారాష్ట్రంలో ఉన్న మొత్తం 48 సీట్లకు గాను 43 గెలుస్తామని బీజేపీ ప్రకటించడాన్ని శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో ఎండగట్గారు. బీజేపీ అతివిశ్వాసం వ్యక్తం చేస్తోందని దుయ్యబట్టింది.

అంతేకాదు.. బీజేపీ మూడు రాష్ట్రాల ఓటమికి బాధ్యత వహించకుండా ఈవీఎంలపై నెపం నెట్టిన బీజేపీది పసలేని విశ్వాసం అంటూ శివసేన ఎద్దేవా చేసింది. ఇలాగే కొనసాగితే లండన్, అమెరికాలో కూడా కమలం వికసించడం కష్టమేమీ కాదంటూ శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అంత విశ్వాసం ఉన్న బీజేపీ అయోధ్యలో రామమందిరం నిర్మించాలని సవాల్ విసిరింది.

శివసేన బీజేపీతో మైత్రి నిలుపుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఇలా శివసేన సామ్నా పత్రికలో కౌంటర్ ఇచ్చింది.