Begin typing your search above and press return to search.

బీజేపీ-శివసేన రహస్య భేటి కథేంటి?

By:  Tupaki Desk   |   27 Sept 2020 3:02 PM IST
బీజేపీ-శివసేన రహస్య భేటి కథేంటి?
X
మహారాష్ట్ర రాజకీయాల్లో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శివసేన ముఖ్యనేత ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో రహస్యంగా భేటి అవ్వడం సంచలనమైంది. ముంబైలోని ఓ హోటల్ లో ఫడ్నవీస్ తో సుమారు గంటన్నరపాటు చర్చ జరిపినట్టు వార్తలు గుప్పుమన్నాయి.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, శివసేన విడిపోయాయి. బీజేపీ ప్రతిపక్షంలోకి పోగా.. కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే మళ్లీ పాత మిత్రులు ఇలా కలవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

అయితే ఈ భేటిపై వెనుక ఎటువంటి రాజకీయ కారణలేవని శివసేన తెలిపింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో పత్రిక కథనం కోసం సంజయ్ రౌత్, ఫడ్నవీస్ ను ఇంటర్వ్యూ చేయాలని భావించారని.. అందుకే ఆయనతో సమావేశమయ్యారని పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్, ఎన్సీపీలతో దోస్త్ కట్ చేసి మళ్లీ బీజేపీతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే ఈ భేటి అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఇరు పార్టీలు గుంభనంగా ఉన్నాయి.