Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ కు షాకిచ్చిన శివసేన

By:  Tupaki Desk   |   22 Oct 2020 11:30 AM IST
మోడీ సర్కార్ కు షాకిచ్చిన శివసేన
X
కొద్దిరోజులుగా ఉప్పునిప్పులా ఉంటున్న ప్రధాని మోడీ, శివసేన చీఫ్ , మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేల మధ్య వార్ మరింత ముదిరింది. ముంబైలో చోటుచేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో బీజేపీ నానాయాగీ చేసి శివసేన సర్కార్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ, శివసేన ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ చేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్పీ స్కాంను కూడా బయటపెట్టి శివసేన సర్కార్ కేంద్రంలోని బీజేపీ అనుకూల చానెల్స్ కు షాకిచ్చిందన్న ప్రచారం ఉంది. దీంతో సదురు చానెల్ పెద్దలను కాపాడేందుకు ఈ కేసును మోడీ సర్కార్ సీబీఐకి అప్పగించబోతున్నరన్న ప్రచారం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి అలెర్ట్ అయ్యి సంచలన నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని మహారాష్ట్రలో నిషేధించింది. ఈ మేరకు నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.ఇక ముందు సీబీఐ అధికారులు మహారాష్ట్రలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేపట్లాల్సి వస్తే ముందుస్తుగా మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర హోంమంత్రిత్వశాఖ అనుమతి ఇవ్వకపోతే సీబీఐ అడుగు పెట్టడానికి లేదు.

ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో సీబీఐ అధికారులు చేపట్టిన కేసులు అధికమయ్యాయి. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు, డ్రగ్స్ మాఫియా కేసు, టీఆర్పీ కుంభకోణం కేసును సీబీఐ విచారిస్తోంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసును నార్కోటిక్స్ కేంద్ర అధికారులు చేస్తున్నారు.

తాజాగా టీఆర్పీ స్కాంలో బీజేపీ అనుకూలంగా పేరుగాంచిన ఓ చానెల్ ఇరుక్కుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించబోతున్నారని తెలిసింది. ఈ టీఆర్పీ కుంభకోణంలో ముంబై పోలీస్ కమిసనర్ పరమ్ బీర్ సింగ్,రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి మధ్య వివాదాలు తలెత్తాయి. యూపీలోనూ దీనిపై కేసులు నమోదు కాగా.. సీబీఐకి అప్పగించాలని కేంద్రం స్కెచ్ వేసింది. దీన్ని అడ్డుగా పెట్టుకొని టీఆర్పీ స్కాంను సీబీఐకి అప్పగించబోతున్నారని సమాచారం అందడంతో మహారాష్ట్ర సర్కార్ అలెర్ట్ అయ్యింది.

దీంతో రాత్రికి రాత్రికి మహారాష్ట్రలో సీబీఐని నిషేధించింది. తద్వారా తమను సుశాంత్ కేసులో టార్గెట్ చేసిన రిపబ్లిక్ టీవీని టీఆర్పీ స్కాం కేసులో మహారాష్ట్ర పోలీసులతోనే విచారణ చేయించేలా శివసేన సర్కార్ ప్లాన్ చేసింది. మరి ఈ ఫైట్ ఎటు దారితీస్తుందనేది ఆసక్తిగా మారింది.