Begin typing your search above and press return to search.

శివసేన అసలు రాజకీయం ప్రారంభించిందిగా..

By:  Tupaki Desk   |   31 Oct 2019 5:20 AM GMT
శివసేన అసలు రాజకీయం ప్రారంభించిందిగా..
X
మహారాష్ట్ర రాజకీయ రోజుకో మలుపు తిరుగుతూ ముందుకు సాగుతుంది. ఫలితాలు వచ్చి దాదాపుగా వారం రోజులు కావొస్తున్నా కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అలాగే బీజేపీ నేతల కౌంటర్లు ... శివసేన నాయకుల ప్రతి కౌంటర్లతో రాష్ట్ర ప్రజలు సైతం వీరికా మేము ఓట్లు వేసింది అని అనుకునేలా చేస్తున్నారు. పని జరిగేవరకు కోటిలింగం ..పని అయ్యాక బోడిలింగం అన్నట్టు సాగుతుంది మహా రాజకీయం. శివసేన 50 -50 ఫార్ములాను కచ్చితంగా అమలు చేయాల్సించిందే అని పట్టుబడుతుంటే ..బీజేపీ దానికి ససేమిరా అంటుంది.

దీనికి తోడు మహారాష్ట్ర సీఎం మరో ఐదేళ్లు నేనే సీఎం అంటూ ప్రకటించుకోవడం తో శివసేన బీజేపీ పై మరింత కోపం పెంచుకుంది. దీనితో రాజకీయాలలో ఎవరూ శాశ్వత మిత్రులు కారు ..ఎవరూ శాశ్వత శత్రువులు కారు అన్నట్టుగా అప్పుడే శివసేన బీజేపీ పై విమర్శల పర్వం ప్రారంభించింది. ఎన్నికల ఫలితాల వచ్చిన మరుసటి రోజే తమ పత్రిక లో బీజేపీ ఇంకా చాలా నేర్చుకోవాలి అని ప్రచురించిన శివసేన తాజాగా మోడీ ,అమిత్ షా లే టార్గెట్ గా ఘాటు విమర్శలుకు దిగింది.

నరేంద్రమోడీ, అమిత్‌షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటరీ సభ్యుల బృందం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించడానికి శివసేన తప్పుపట్టింది. దీనిపై శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ఘాటుగా రాసింది . జమ్మూకాశ్మీర్‌ దేశ అంతర్గత వ్యవహరమని, దీన్ని నరేంద్రమోడీ రచ్చ కీడుస్తున్నారని, యూరోపియన్‌ పార్లమెంటేరియన్‌ బృందాన్ని జమ్మూకాశ్మీర్‌ పర్యటనకు ఎవరిని అడిగి అనుమతించారు అంటూ నిలదీసింది. మన దేశంలోని ఇతర పార్టీల నేతలు జమ్మూకాశ్మీర్‌ పర్యటనకు వెళితే వారిని నిర్బంధించి విమానాశ్రయం నుండే వెనక్కి పంపించారని..మరి వారిని ఎలా అక్కడికి అనుమతించారంటూ సామ్నా ఎడిటోరియల్‌లో ప్రచురించింది.

ఇక బీజేపీ .. శివసేన ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండం తో ముఖ్యమంత్రి పదవి విషయంలో కొలిక్కి రాలేకపోతున్నాయి. దీనితో దీన్ని క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. శివసేనతో కాంగ్రెస్ నేతలు మాట్లాడినట్టు సమాచారం. కాంగ్రెస్ తో శివసేన కలిసి వస్తానంటే ..ఎన్సీపీ తో మేము మాట్లాడతామని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా మహారాష్ట్ర రాజకీయం ఎటువైపు వెళ్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు.