Begin typing your search above and press return to search.

వైసీపీలో వర్గ విభేదాలు..బయటపెట్టిన శిల్ప

By:  Tupaki Desk   |   29 Feb 2020 10:45 AM GMT
వైసీపీలో వర్గ విభేదాలు..బయటపెట్టిన శిల్ప
X
వైసీపీలో వర్గ విభేదాలు పొడచూపాయి. కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్యే, మరో నేత ఆధిపత్య పోరుతో కొట్టుకుంటున్నారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎంపికపై జరుగుతున్న వర్గపోరులో మంత్రి అనిల్ ఆధిపత్యం చెలాయించడం.. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సపోర్టు చేస్తున్నారు. ఇది నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎమ్మెల్యే వర్సెస్ బైరెడ్డి, మంత్రిగా వార్ నడుస్తోంది.

తాజాగా మంత్రి అనిల్ పై ఎమ్మెల్యే అర్థర్ వర్గం విరుచుకుపడింది. దారుణ విమర్శలు చేసింది. దీంతో వైసీపీ విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో వైసీపీ అధినేత సీఎం జగన్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. వీరి వివాదాలను పరిష్కరించే బాధ్యతను సొంత పార్టీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి జగన్ అప్పగించారు. శిల్పా తాజాగా ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డిలను కూర్చోబెట్టి మాట్లాడుతానని ప్రకటించారు.

ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్థర్ , బైరెడ్డి మధ్య విభేదాలు వాస్తవమేనన్నారు. ఇవి తమ కుటుంబ సమస్యలుగా భావిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఇద్దరి మధ్య విభేదాలు పరిష్కరించి రాజీ కుదుర్చుతామని శిల్పా తెలిపారు.

కాగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య కొద్దికాలంగా వైరం నడుస్తోంది. ఎమ్మెల్యే ఆర్థర్ ఇటీవలే మార్కెట్ కమిటీకి ఓ పేరును ప్రతిపాదించారు. బైరెడ్డి మరో వ్యక్తి పేరును పంపారు. వైసీపీ అధిష్టానం బైరెడ్డి వర్గానికే మద్దతు తెలిపింది. దీంతో పాటు కాంట్రాక్టుల్లో కూడా బైరెడ్డి దక్కించుకోవడంతో ఆర్థర్ వర్గం ఇలా మంత్రి అనిల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ బైరెడ్డి, ఎమ్మెల్యే, మంత్రి వివాదాన్ని తాజాగా ఎమ్మెల్యే శిల్పా పరిష్కరించనున్నారు.

మంత్రి అనిల్ జోక్యం చేసుకోవడంతో తాజాగా ఎమ్మెల్యే అర్థర్ అనుచరులు రెచ్చిపోయారు. మంత్రి అనిల్ ను కర్నూలులో అడుగు పెట్టలేవ్ అని ఏకంగా వైసీపీ నందికొట్టూర్ ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ అనుచరుడు హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికంతటికి కారణం మంత్రి అనిల్ మార్కెట్ కమిటీ విషయంలో వేలు పెట్టడం.. ఆధిపత్యం చెలాయించడమే కారణమని తెలుస్తోంది. దీంతో వైసీపీ అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టింది