Begin typing your search above and press return to search.

ఈ కిలేడీ వలలో టాలీవుడ్ హీరోలు బుక్కయ్యారా?

By:  Tupaki Desk   |   27 Nov 2021 7:30 AM GMT
ఈ కిలేడీ వలలో టాలీవుడ్ హీరోలు బుక్కయ్యారా?
X
శిల్పా చౌదరి.. ఇప్పుడీ పేరు మీడియాలో మారుమోగుతోంది. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఏకంగా 200 కోట్ల వరకూ కుచ్చుటోపీ పెట్టినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో పోలీసులు శిల్పా చౌదరిని అరెస్ట్ చేయడంతో ఈమె టాలీవుడ్ హీరోలను మోసం చేసిందని కథలు కథలుగా ప్రచారం సాగుతోంది.

సెలబ్రెటీల కార్యకలాపాలకు సంబంధించిన ఫేజ్3 వార్తలు ఫాలో అయ్యేవారికి శిల్పా చౌదరి పరిచితురాలే. టాలీవుడ్ హీరోలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, లాయర్లతో ఈమె బాగా క్లోజ్ గా ఉండి శివారు ప్రాంతాల్లో తరచూ ఫేజ్ 3 పార్టీలు ఇస్తూ వారిని ఆకర్షించేదట..

తాజాగా అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి టాలీవుడ్ హీరోలు, బడాబాబుల దగ్గర ఈమె డబ్బులు లాగేసిందట.. ఈమె వలలో చిక్కిన వారిలో టాలీవుడ్ యువ హీరోలు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారని టాక్.

శిల్పా వడ్డీ వ్యాపారాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేసినట్టు సమాచారం. దీంతో ఈమె చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

శిల్పా చౌదరి ప్రముఖుల పేర్లు చెప్పి డబ్బులను తీసుకుంటూ త్రీ ఫేజ్ పార్టీలు ఇచ్చి సెలబ్రెటీలను ఆకర్షించేదట.. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం ప్రముఖులను తన బుట్టలో వేసుకొని 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకూ కుచ్చు టోపీ పెట్టేదట.. విషయం గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు రట్టు అయ్యింది. శిల్పాతోపాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది.

తక్కువ సమయంలో డబ్బును రెండితలు, మూడింతలు చేస్తానని.. అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి శిల్పా చౌదరి ఏకంగా 200 కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టిందని సమాచారం. ఈమెను నమ్మి కొందరు కోట్ల రూపాయలు సమర్పించుకున్నారట.. తీరా అధిక వడ్డీ కాదు కదా.. కనీసం అసలు కూడా తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 200 కోట్ల మోసానికి శిల్పా చౌదరి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. శిల్పా వలలో టాలీవుడ్ హీరోలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, లాయర్లు, ఫైనాన్షియర్లు ఉన్నట్టు సమాచారం. ఇందులో ముగ్గురు యువ హీరోలు కూడా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.