Begin typing your search above and press return to search.

జైలు నుంచి బయటకు వచ్చిన శిల్పా చౌదరీ..!

By:  Tupaki Desk   |   24 Dec 2021 1:41 PM GMT
జైలు నుంచి బయటకు వచ్చిన శిల్పా చౌదరీ..!
X
శిల్పా చౌదరీ... గత కొద్ది రోజులుగా మీడియాలో చాలా బాగా వినిపిస్తున్న పేరు. డబ్బున్న వారు, గొప్ప హోదాల్లో ఉన్న వారు, సమాజంలో పేరు, పలుకుబడి ఉన్న వారు, సినిమా నటులు, వారి బంధువులు, కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని వారితో పరిచయాలు పెంచుకొని వారి నుంచి కోట్లది రూపాయిలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తి శిల్పా చౌదరి. మహిలు సరదాగా చేసుకునే కిట్టీ పార్టీలకు డబ్బున్న వారిని పిలిచి వారి అధిక మొత్తంలో వడ్డీని ఆశ చూపించింది శిల్పా. ఈమె మాటలు నమ్మి డబ్బులు ఇచ్చిన వారికి పెద్ద కుచ్చు టోపీ పెట్టింది. వారి నుంచి కోట్ల రూపాయిలు వసూలు చేసింది. హైదరాబాద్​ లో రియల్​ ఎస్టేట్​ బాగుంటుందని నమ్మించి వారిని మోసం చేసింది. ఈ కేసుల్లోనే జైలుకు పోయిన శిల్పా చౌదరీ కొద్ది రోజులు జైలు జీవితం తరువాత తిరిగి బయటకు వచ్చింది.

శిల్పా చౌదరీ బయటకు వచ్చేందుకు హైదరాబాద్ రాజేంద్ర నగర్​ లోని కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్​ మంజూరు చేయడానికి కొన్ని షరతులను పాటించాలని న్యాయస్థానం సూచించింది. మొత్తంగా ఆమెపై ఉండే మూడు కేసులకు సంబంధించి బెయిల్​ ను మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆమె బెయిల్​ ఉత్తర్వులు చంచల్​ గూడ జైలుకు చేరుకున్నాయి. వాటిని పరిశీలించిన జైలు అధికారులు అమెను శుక్రవారం విడుదల చేశారు.

శిల్పా చౌదరికి బెయిల్​ ఇచ్చిన కోర్టు కొన్ని షరతులను కూడా విధించింది. జైలు నుంచి విడుదల అయిన తరువాత దేశం విడిచి ఎక్కడకీ పోకూడదని చెప్పింది. దీనితో పాటు రూ.10 వేలు ను పూచీకత్తుగా కట్టాలని ఆదేశించింది. అంతేగాకుండా బయటకు వెళ్లిన తరువాత కేసుకు సంబంధించిన అంశాలపై ఇతరులతో చర్చించకూడదని పేర్కొంది. ఫోన్​ లో కానీ, డైరెక్ట్ గా కానీ ఈ విషయాలను మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేస్తూ.. బెయిల్ మంజూరు చేసింది. దీనితో పాటు నార్సింగ్​ లోని పోలీస్ స్టేషన్ లో ప్రతీ శనివారం విధిగా హాజరు కావాలి చెప్పింది. వీటిలో ఏదైనా అతిక్రమించన ఎడల బెయిల్​ రద్దు అవుతుందని స్పష్టం చేసింది.

గత నెల 13న శిల్పా చౌదరిపై తొలి కేసు నమోదు అయ్యింది. దివ్యా రెడ్డి అనే మహిళ తొలుత నార్సింగి పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు 25న శిల్పా చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు భర్తను కూడా అరెస్ట్​ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో పోలీసులు ఇరువురిని రిమాండ్​ కు పంపారు. ఇప్పటి వరకు మూడు సార్లు కస్టడికి తీసుకుని విచారించారు. దీంతో కొంత మేర నోరు విప్పిన ఆమె బాధితుల దగ్గర నుంచి తీసుకున్న సొమ్మును తిరికి ఇచ్చేస్తానని పేర్కొంది. ఇప్పటి వరకు తన ఆస్తి వివరాలను కొంత మేరకు మాత్రమే వివరించినట్లు పోలీసులు తెలిపారు. తన పేరు మీద ఉండే విల్లా, హయత్ నగర్​ లో ఉండే ఫ్లాట్​, ఇతర ఆస్తులను కూడా అమ్మి కడతాని పేర్కొంది.