Begin typing your search above and press return to search.

కొవిడ్ ఎఫైక్ట్ పై 'షెక్నోస్' సంచలన నివేదిక

By:  Tupaki Desk   |   24 Sep 2022 6:06 AM GMT
కొవిడ్ ఎఫైక్ట్ పై షెక్నోస్ సంచలన నివేదిక
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతం చేసింది. ఈ వైరస్ తాకిడికి ఇప్పటికీ చాలా మంది కోలుకోవడం లేదు. కరోనా తీవ్రత తగ్గినా అది చూపిన ప్రభావంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభావం అమెరికాపై తీవ్రంగా పడింది. ఇక్కడ కోటికి పైగానే మరణించడం బాధాకరం. అంతేకాకుండా కొవిడ్ బాధితులు ఇప్పటికీ కొనసాగుతుండడం గమనార్హం. అయితే తాజాగా అమెరికాకు చెందిన 'షెక్నోస్' అనే వెబ్ సైట్ ఓ నివేదికను బయటపెట్టింది. దీర్ఘకాల కొవిడ్ తో అమెరికా గుణపాఠం నేర్చుకున్నదని తెలిసింది. ఇంకా ఈ వెబ్ సైట్ తెలిపిన వివరాల్లోకి వెళ్తే..

రుచి, వాసన తెలియకపోవడంతో పాటు తీవ్రమైన జ్వరం, తలనొప్పి ఉండడం కొవిడ్ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు సాధారణంగా అందరిలో ఉంటాయి. కానీ కొవిడ్ ప్రారంభమైన నుంచి చాలా మందిలో ఇవి తీవ్రమయ్యాయి.

కొవిడ్ కాలంలో మొదలైన కొన్ని వ్యాధులు ఇప్పటికీ బాధితుల నుంచి దూరం కావడం లేదంటే అతిశయోక్తి కాదు. సుధీర్ఘమైన ఇలాంటి లక్షణాలతో ఇతర వ్యాధులు రావడానికి కారణమయ్యాయి. దీంతో కొందరు కొవిడ్ శాశ్వత బాధితులగా మారారని ఆ వెబ్ సైట్ తెలిపింది.

మొదట్లో కొవిడ్ ప్రాథమిక లక్షణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్నింటిని మాత్రమే పేర్కొంది. కానీ ఇందులో చాలా మార్పులు వచ్చాయి. కొందరిలో తీవ్రమైన అలసట, గుండె దడ, చెవులు నిరంతరం మోగడం, పాదల నొప్పి,ఆహారం మింగడానికి కష్టంగా మారడం వంటి లక్షణాలు కూడా కొవిడ్ బాధితుల్లో ఉన్నాయి.

అయితే ఇవి కొవిడ్ ప్రారంభమైన రోజుల్లో లేకపోయినా ఆ తరువాత అది చూపిన ప్రభావంతో ఇలాంటి లక్షణాలు దరిచేరాయి. ఇలా బాధపడడం కూడా అంగవైకల్యం లాంటిదేనని వెబ్ సైట్ పేర్కొంది.

ప్రతీ ఐదుగురు అమెరికన్లలో ఒకరు లాంగ్ కొవిడ్ తో బాధపడుతున్నారు. జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ ను ఉటంకిస్తూ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ను జోడిస్తూ ఈ వివరాలను అందించింది. దీంతో ఇప్పుడు అమెరికా కొవిడ్ బాధితుల్లో చాలా మంది శాశ్వత వికలాంగుల మాదిరిగా ఏదో ఒక వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తోందని 'షెక్నోస్' పేర్కొంది. అయితే ఈ దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు తాత్కాలికంగా మెడిసిన్స్ వాడుతున్నా.. దీర్ఘకాలికంగా మాత్రంనయం అయ్యే పరిస్థితి లేదని తెలిపింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.